#AA21 టాప్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ.. ఆ దర్శకుడితో సినిమా అంటూ ఐకాన్ స్టార్ షాక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగుకు సంబంధించి చివరి ఫేజ్‌లో ఉందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే పుష్ప 2 సినిమా తర్వాత ఎవరితో మూవీ చేయబోతున్నాడనే విషయం గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లోను, మీడియాలోను చర్చ జరుగుతున్నది. అయితే ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 షూటింగు సమయంలోనే అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా గురించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి. త్రివిక్రమ్, అట్లీ, నెల్సన్ లాంటి దర్శకులతో సినిమాలు ఉంటాయని గాసిప్స్ వచ్చాయి. అయితే ఆయన, అతడి పీఆర్ టీమ్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ రూమర్లు మాత్రం ఆగలేదు.

పుష్ప 2 మూవీ తర్వాత తన చిత్రం గురించి మీడియాలో వస్తున్న రూమర్లకు ఐకాన్ స్టార్ తెర దించారు. తన కెరీర్‌లో 21వ సినిమాగా రూపొందనున్న మూవీని అధికారికంగా ప్రకటించారు. #AA21 మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఉంటుందని అభిమానులకు సంతోషకరమైన వార్తను అందించారు.
అల్లు అర్జున్ తన స్టేటస్‌ను అప్ డేట్ చేస్తూ నా కెరీర్‌లో 21వ సినిమాను ప్రకటించడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. కొరటాల శివతో నా సినిమా ఉంటుంది. ఈ సినిమాతో చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్నాను. తొలి సినిమా చేస్తున్న నిర్మాత సుధాకర్‌కు నా బెస్ట్ విషెస్. ఈ విధంగా సాండీ, స్వాతీ, నట్టి మీపై ఇలా ప్రేమను చూపుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.
ఇదిలా ఉండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలో సెప్టెంబర్ 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయిన రోజే ఈ వార్త బయటకు రావడం క్రేజీగా మారింది. కొరటాల శివపై మరింత అంచనాలు పెరిగేలా చేశాయి.
ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే రికార్డు లెవెల్ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











