Aadavallu Meeku Johaarlu ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి.. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. సహజ సిద్ధమైన నటనతో కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. విలక్షణమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన ఈ యంగ్ హీరో.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొన్ని విజయాలను సైతం సొంతం చేసుకున్నాడు. ఫలితంగా శర్వానంద్ చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్నాడు.
శర్వానంద్ గత ఏడాది 'శ్రీకారం' అనే సినిమాతో పాటు 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో అతడికి 2021 నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఇక, వీటి తర్వాత శర్వానంద్ పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం.. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రచార చిత్రాలతో శర్వానంద్ నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, ప్రేక్షకుల నుంచి దీనికి అంతగా స్పందన రాలేదు. ఫలితంగా ఫుల్ రన్‌లో రూ. 7.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.75 కోట్ల గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రానికి రూ. 8.20 కోట్లు నష్టాలు వచ్చాయి.

థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఓటీటీ రిలీజ్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీని స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ ఎన్నో తేదీలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి అధికారిక ప్రకటన వెలువడింది. శర్వానంద్ హీరోగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీని ఏప్రిల్ 14 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది. ఇక, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం సోనీ సంస్థ భారీ మొత్తాన్నే వెచ్చించినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల రూపొందించిన చిత్రమే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. దీన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ కీలకమైన పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











