శర్వానంద్ కోసం బడా డైరెక్టర్: ఇద్దరు హీరోయిన్లతో కలిసి తగ్గేదేలేదంటూ రచ్చ

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. ఆ తర్వాత హీరోగా మారిన అతడు.. తనలోని సహజ సిద్ధమైన నటనతో పాటు విలక్షణమైన శైలిని ప్రేక్షకులకు చూపించి మన్ననలు పొందాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో శర్వానంద్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకున్నాడు. ఇక, ఆ మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎన్నో సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

గత ఏడాది శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాతో పాటు 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో అతడికి 2021 నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం శర్వానంద్ పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఉన్నాడు. అందులో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కిశోర్ తిరుమలతో చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఏర్పడ్డ విషయం తెలిసిందే.

వాస్తవానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, కరోనా ప్రభావంతో పాటు కొన్ని అనుకోని సంఘటలను ఎదురు కావడంతో ఈ మూవీ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇది టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం చిత్ర యూనిట్ వేగంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. కానీ, పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' విడుదల కారణంగా దీన్ని వాయిదా వేసేశారు.

Aadavallu Meeku Johaarlu Pre Release Event on February 27th

'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీని మార్చి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీన్ని ఫిబ్రవరి 27వ తేదీన హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తి సురేష్‌తో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్ గెస్టులుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ ర‌ష్మిక మందాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దీనికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ మూవీలో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్, రవి శంకర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X