బుర్రకథ ట్రైలర్.. అన్ని క్యారెక్టర్లు హైలైటే..
యంగ్ హీరో ఆది నటిస్తున్న కొత్త సినిమా 'బుర్రకథ'. చాలాకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయపడుతున్న హీరో ఆది.. ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బుర్రకథ ట్రైలర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ సీనియర్ హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
రెండు నిమిషాల నాలుగు సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో చూపించిన ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాయి. డ్యూయల్ రోల్‌లో ఆది అదరగొట్టేశాడని అర్థమవుతోంది. ఆది తండ్రిపాత్రలో రాజేంద్రప్రసాద్, మరో ముఖ్యపాత్రలో పోసాని కృష్ణమురళి ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ పట్ల కూడా జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్‌లో కనిపించిన నటీనటులంతా హైలైట్ నటన కనబర్చారు. ఇది సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చే అంశం.

ఇక ట్రైలర్‌లో డైలాగుల పరంగా చూస్తే.. ''రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. కానీ, నా శత్రువు నాతోనే ఉన్నాడు'' అంటూ ఆది చెప్పిన డైలాగ్ ఆకర్షిస్తోంది. అదేవిధంగా ''స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను'' అంటూ ఆది చెప్పే మరో డైలాగ్ ఈ సినిమాలో కామెడీకి కొదవేం లేదు అని చెప్పేస్తోంది. ఇక చివర్లో సాహో ట్రైలర్‌లో ప్రభాస్ చెప్పిన 'ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్' డైలాగ్‌ను కమెడియన్ పృథ్వీ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా 'బుర్రకథ'పై అంచనాలు పెంచేశారు యూనిట్ సభ్యులు.
బుర్రకథ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. చిత్రంలో రామ్, అభి అనే రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఆది నటిస్తున్నాడు. ఆది సరసన మిస్తీ చక్రబోర్తి హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 28న 'బుర్రకథ' విడుదల కాబోతోంది


Click it and Unblock the Notifications











