CSI Sanatan క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..

యువ హీరో ఆది సాయికుమార్ తన ఖాతాలో విజయాన్ని వేసుకొనేందుకు సిద్దమయ్యారు. ఇటీవల కాలంలో విభిన్నమైన చిత్రాలతో నటిస్తూ మెప్పిస్తున్న ఆది ప్రస్తుతం చాగంటి ప్రొడ‌క్ష‌న్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సీఎస్ఐ స‌నాత‌న్‌గా ఖరారు చేశారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి చేతుల మీదుగా ఆవిష్కరించారు. క్రైమ్ సీన్ ఇన్వ‌స్టిగేష‌న్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్‌గా ఆదిసాయికుమార్ విభిన్నమైన పాత్రలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

పూర్తిస్థాయి క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇటీవలే ఓ భారీ షెడ్యూల్‌ను ఫూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్నది.సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27న ప్రారంభ‌మ‌వుతుంద‌ని చిత్ర నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ అన్నారు.

Aadi Sai kumar latest movie CSI Sanatan: Title unveilled by Anil Ravipudi

ఆది సాయికుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆవిష్కరించిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్ర కథను తెలుసుకొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాన్సెప్ట్‌ని ఎలివేట్ చేసే మోష‌న్ పోస్ట‌ర్‌తో అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన మోష‌న్ పోస్ట‌ర్ చాలా ఇప్రెసివ్ గా ఉంది అని అనిల్ రావిపూడి అన్నారు.

సీఎఎస్ఐ సనాతన్ చిత్రంలో తార‌క్ పోన్న‌ప్ప‌, నందిని రాయ్, అలీ రాజా, వ‌సంతి , మ‌ధు సూద‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శివ‌శంక‌ర్ దేవ్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు.

Aadi Sai kumar latest movie CSI Sanatan: Title unveilled by Anil Ravipudi

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఆది సాయికుమార్ చాలా ప్రెష్‌గా కనిపించారు. క్రైమ్ థ్రిల‌ర్స్‌ని గ్రిప్పింగ్‌గా చెప్ప‌గ‌లిగితే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్, నిర్మాత అజ‌య్ శ్రీనివాస్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు..

నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండ్రోజుల క్రిత‌మే ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నాం.. మ‌రో షెడ్యూల్ ఈ నెల 27 న మొద‌ల‌వుతుంది. ఈ షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేస్తాము. ఆది సాయికుమార్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తారు. స‌నాత‌న్‌గా ఆయ‌న న‌ట‌న చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాము అని అన్నారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X