క్యూట్ లవ్‌స్టోరిగా జోడి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించబోతున్న చిత్రం 'జోడి'. ఆగస్టు 29 విడుదలైన ట్రైలర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఆది, శ్రద్దా శ్రీనాత్ మధ్య క్యూట్ లవ్ స్టోరీతోపాటు సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ రోల్ చాలా ఆసక్తిగా కనిపించింది. అవుట్ అండ్ అవుట్ ప్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతుంది. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉన్న జోడికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బాగా వచ్చింది.
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న హీరో ఆది, యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్దా శ్రీనాథ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే అందమైన ప్రేమకథగా జోడి తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి ఆఫర్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.

హీరో ఆది, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ లుక్స్ కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరెకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ యూత్‌కి బాగా రిలేట్ అయ్యే విధంగా మలచబడింది. ఏ పాత్రకయినా వందశాతం న్యాయం చేసే హీరో ఆది. ఈ మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రతో మెప్పించబోతున్నాడు.
నటీనటులు: ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, వికే నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరులు
సంగీతం : 'నీవే' ఫణికళ్యాణ్,
సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్,
ఎడిటర్ : రవి మండ్ల,
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ వర్మ,
మాటలు : త్యాగరాజు (త్యాగు),
నిర్మాణ : శాంతయ్య, నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం,
దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల
భావనా క్రియేషన్స్ బ్యానర్


Click it and Unblock the Notifications











