Aamani: నాతో మందు తాగించారు.. నరేష్ కూడా అలా చేశారు.. షాకింగ్ గా నటి ఆమని!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా హీరోయన్ ప్రాధాన్యత చిత్రాల్లో నటించి మెప్పు పొందేవారు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఆమని ఒకరు. 90వ దశకంలో పాత్ర ప్రాధాన్యత చిత్రాలు చేసిన కథానాయికగా గుర్తింపు పొందారు. అంతకుమించి మావి చిగురు, శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. శుభలగ్నం సినిమాల్లో ఆమె డైలాగ్ డెలివరీకి, ఊత పదానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం హీరోలకు తల్లి పాత్రలతో అలరిస్తున్న ఆమని తనతో మందు తాగించారంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

ఈవీవీ సత్యనారాయణ సినిమాతో..
కథానాయిక ప్రాధాన్యత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ ఆమని. 1990వ దశకంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం వంటి సినిమాలలో జగపతి బాబుతో నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించారు. బ్యూటిఫుల్ సీనియర్ హీరోయిన్ ఆమని.. ప్రముఖ దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేశారు.

మొదట్లో అంగీకరించలేదు..
అయితే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమని. "మా నాన్న డిస్ట్రిబ్యూటర్. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ. నటిగా రాణించాలని, అందరి మెప్పు పొందాలని ఎన్నో కలలు కన్నాను. సినిమాల్లోకి వస్తానంటే మా నాన్న మొదట్లో అంగీకరించలేదు. తర్వాత నాకున్న ఇష్టం చూసి ఒప్పుకున్నారు" అని ఆమని తెలిపారు.

చాలా బాధగా అనిపించింది..
ఆమని ఇంకా కొనసాగిస్తూ.. "తమిళ సినిమాలతో కెరీర్ ప్రారంభించాను. అవకాశాల కోసం రెండేళ్లు ఇబ్బందులు పడ్డాను. ఛాన్స్ లు ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా చెప్పేవాళ్లు. ఒంటరిగా వచ్చి కలవమనేవారు. మా అమ్మ చొరవతో వాటన్నింటిని సున్నితంగా తిరస్కరించాను. కొంతకాలానికి వాళ్ల మాటల్లోని అర్థాలు తెలుసుకోగలిగాను. అప్పుడు చాలా బాధగా అనిపించింది. నాన్న చెప్పిన వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చానా అని. అందుకే నాకు మొదట్లో అవకాశాలు సరిగ్గా రాలేదు" అని అన్నారు.

నాకు అదంతా తెలీదు..
"కొన్ని రోజులకు తెలుగులో జంబలకిడి పంబ సినిమాలో తొలి ఆఫర్ వచ్చింది. దాంతో నేను తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారాను. అయితే ఇందులో మందు కొట్టే సీన్, సిగరెట్ కాల్చే సీన్స్ ఉన్నాయని డైరెక్టర్ నాకు ముందు చెప్పలేదు. షూటింగ్ స్పాట్ కు వెళ్లినప్పుడు ఏ అమ్మాయి ఈరోజు మందు కొట్టే సీన్ ఉంది అన్నారు. నేను సార్ అని మొహం అదోలా పెట్టేదాన్ని. నాకు అదంతా కొత్త. తెలీదు" అంటూ చెప్పుకొచ్చారు ఆమని

ఒక అరగంట ప్రాక్టీస్ చేసి..
ఇంకా ఆమని కొనసాగిస్తూ "సరే బాటిల్ ఏదో కూల్ డ్రింక్ వేసి ఇస్తారులే అనుకున్నా. కానీ బాటిల్ ను ఓపెన్ చేస్తే బయటకు పొంగాలన్నారు. పొంగినప్పుడు నువ్వు సిప్ చేయాలి అన్నారు. ఒక్క షాట్ చేయమ్మా అన్నారు. హీరో నరేష్ గారు కూడా ఏం కాదమ్మా.. తాగు అన్నారు. సిగరేట్ కూడా డైరెక్ట్ గా కాల్చాలి. ఆ స్మోక్ బయటకు స్టైల్ గా వదలాలి. నేను ఒక అరగంట ప్రాక్టీస్ చేసి అవన్నీ చేశాను" అని వెల్లడించారు.

ఫస్ట్ సినిమాలోనే చేశాను..
"చావు కబురు చల్లగా సినిమాలో కూడా మందు కొట్టే సీన్ లో నటించాను. అయితే ఈసారి బాటిల్ లో కూల్ డ్రింక్ పోసి ఇచ్చారు. గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చింది. కథ చెప్పారు. నాకు నచ్చి నేను తప్పకుండా చేస్తానని డైరెక్టర్ కౌశిక్ తో చెప్పాను. ఆ తర్వాత అరవింద్ గారు వచ్చారు. చేస్తావా అమ్మా అని అడిగారు. చేస్తాను సార్. కథ నాకు చాలా నచ్చింది అని చెప్పాను. అంటే, అందులో మందుకొట్టే సీన్ ఉంది. నీకు ఓకేనా అని అడిగారు. నేను పర్వాలేదు సార్. నా ఫస్ట్ సినిమాలోనే ఇలా చేశాను అని నవ్వుతూ చెప్పాను" అని ఆమని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











