‘ఆమె’ నగ్నత్వంలోని నిజాయితీ నా గుండెను టచ్ చేసింది!
అమలా పాల్ ప్రధాన పాత్రలో రూపొందిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'ఆడై'. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతో రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో అమలా పాల్ పూర్తి నగ్నంగా కనిపించడమే అందుకు కారణం.
ఈ టీజర్‌పై రాంగోపాల్ వర్మ స్పందించారు. 'ఆమె' టీజర్ అమేజింగ్ అంటూ ప్రశంసలు గుప్పించారు. అమలా పాల్ నగ్నత్వంలో ఒక నిజాయితీ కనిపించిందని, అది నా గుండెను టచ్ చేసిందని పేర్కొన్నారు. దర్శకుడు రత్నకుమార్ ఇంటిగ్రిటీ ఎక్స్‌ప్లోసివ్‌గా ఉందని తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీటుపై అమలా పాల్ స్పందించారు. 'థాంక్స్యూ సర్... మీరు మా టీజర్ గురించి స్పందించడం నాతో పాటు ఆడై టీంకు ఒక సర్‌ప్రైజ్. మీ ప్రశంస మాకు ఎంతో మేలు చేస్తుంది' అంటూ రిప్లై ఇచ్చారు. 'ఆమె' టీజర్‌కు సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తోంది.

టీజర్లో అమలా పాల్‌ను నగ్నంగా చూపించిన దర్శకుడు.... ఆ నగ్నత్వం వెనక ఉన్న ఒక హృదయ విదారకమైన కథ చెప్పనున్నట్లు హింట్ ఇచ్చాడు. తాను చెప్పబోయే కథ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికే హీరోయిన్‌ను అలా ప్రజంట్ చేసినట్లు స్పష్టమవుతోంది
ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్య గురించి చర్చిస్తూ ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. మహిళలకు ఈ సమాజంలో స్వేచ్ఛ ఏమేరకు ఉంది? స్వేచ్ఛ లభించిన వారు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











