Allu Arjun కారులో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ సినిమాల కోసమే? వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్టైలిష్ స్టార్ గా ఎంతోకాలంగా ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే నార్త్ ప్రజలేకాకుండా విదేశీయులు కూడా వాటిని రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ కారులో ఓ బాలీవుడ్ హీరో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అనేక అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద..
అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం మొదటి పార్టుకు మించిన స్థాయిలో పుష్ప 2ను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే నేడు అల్లు అర్జున్ మ్యారేజ్ యానివర్సరీ. ఈ క్రమంలో సెలబ్రేషన్స్ లో ఉండాల్సిన బన్నీ హైదరాబాద్ విమానశ్రయం వద్ద తళుక్కుమన్నాడు. అది ఆయన భార్య స్నేహా రెడ్డితో కాకుండా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కోసం ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు బన్నీ.

డిజాస్టర్ టాక్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన విలక్షణమైన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్నమైన సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు వివాదాల్లో కూడా నిలిచారు. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఓటమి చవిచూశారు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమెక్ గా వచ్చిన ఈ మూవీ నవంబర్ 2022న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

వీడియో వైరల్..
లాల్ సింగ్ చద్దా సినిమాతో ఓటమి చూసిన అమీర్ ఖాన్ తర్వాతి ప్రాజెక్ట్ పై ఫుల్ పోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో హైదరాబాద్ కు వచ్చిన అమీర్ ఖాన్ ను ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకునేందుకు అల్లు అర్జున్ రావడం చర్చనీయాంశంగా మారింది. బ్లాక్ కలర్ కారులో అల్లు అర్జున్ ఎదురుచూస్తుండగా.. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న అమీర్ ఖాన్ అందులో ఎక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

గజినీ 2 కోసమేనా..
అయితే ఇదివరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిందీలో అమీర్ ఖాన్ గజిని చిత్రం చేసిన విషయం తెలిసిందే. మెమోరీ లాస్ పేషంట్ గా అమీర్ ఖాన్ అదరగొట్టిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు గజినీ 2 సినిమా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ గజినీ 2 సినిమా కోసమే అల్లు అర్జున్ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఇంటికి అమీర్ వెళ్లడంపై ఏదో గొప్పగానే జరగబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సౌత్ హీరోలతో ఫ్రెండ్షిప్..
గీతా ఆర్ట్స్ లో గజినీ 2, మహా భారత్ సినిమాలు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానర్ లో మహా భారత్ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అయితే గజినీ 2, లేదా మహా భారత్ సినిమాపై చర్చించేందుకే అమీర్ ఖాన్ హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ఇంటికి వెళ్లనున్నట్లు ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ కు సౌత్ హీరోలతో మంచి స్నేహం ఉంది. చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య, అల్లు అర్జున్ తోపాటు చాలా మందితో అమీర్ కు ఫ్రెండ్షిప్ ఉంది. ప్రస్తుతం ఈ మిస్టర్ పర్ఫెక్ట్ హైదరాబాద్ రావడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











