ప్రియుడితో అమీర్ ఖాన్ కూతురు సరసాలు.. అధికారికంగా లివింగ్ రిలేషన్
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అఫైర్ల వ్యవహారం బాలీవుడ్ మీడియాలో కొద్దికాలంగా హంగామా జరుగుతున్నది. ఇప్పటి వరకు ఊహాగానాలతో సరిపెట్టుకొన్న ఇరా ఖాన్ తన అఫైర్, బాయ్‌ఫ్రెండ్‌ను అధికారకంగా ప్రకటించారు.
కొద్ది నెలలుగా ఫిట్‌నెస్ కోచ్ నూపుర్ షికరేతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అయితే మీడియా తన అఫైర్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇరా సమాధానం దాటవేశారు. తాజాగా తన అఫైర్ గురించి బట్టబయలు చేస్తూ నీతో చేసిన ప్రామిస్‌లు నాకు గర్వంగా మారాయి అంటూ ఓ మెసేజ్ పెట్టి మై వాలంటీన్, బడ్డీ, డ్రీమ్ బాయ్ అనే హ్యాష్ ట్యాగ్స్‌ను షేర్ చేసింది.

ఇరా ఖాన్ తన కజిన్, యాక్టర్ జయాన్ ఖాన్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో తన ప్రియుడు నూపుర్ శిఖారే ప్రత్యేక ఆకర్షణగా మారారు.



Click it and Unblock the Notifications











