అమీర్ ఖాన్ సోదరి బాలీవుడ్ ఎంట్రీ.. షార్ప్ షూటర్‌గా
సినీ పరిశ్రమలో నటుల వారసుల రాకను ఇప్పటి వరకు చూశాం. చాలాకాలంగా కొడుకులు, కూతుళ్లను వెండి తెరకు హీరోలు పరిచయం చేస్తూ రావడం చూశాం. కానీ ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సోదరిని పరిచయం చేస్తున్నారు. అమీర్ సోదరి నికత్ ఖాన్ నటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సాండ్ కీ ఆంఖ్ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో భూమి పడ్నేకర్, తాప్సీ పన్ను నటిస్తున్నారు. వీరితో కలిసి నికత్ ఖాన్ వెండితెర మీద కనిపించనున్నారు. చాలా కాలంగా నికత్ ఎంట్రీని సీక్రెట్‌గా దాచారు. తన మొదటి చిత్రంలోనే తుపాకి చేతపట్టిన మహిళగా కనిపించబోతున్నారు.

సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో నికత్ ఖాన్ మహారాణిగా కనిపిస్తారు. ఆమెది అతిథి పాత్ర కాదు. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కీలకమైన సన్నివేశాల్లో నికత్ కనిపిస్తారు అని దర్శకుడు తుషార్ హిరణ్ నందానీ తెలిపారు
షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాషీ తోమార్ జీవితం ఆధారంగా సాండ్ కి ఆంఖ్ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ నిర్మాతగా మారారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











