"పుష్ప 2" రీల్ తోనే "పుష్ప 2"లో ఛాన్స్ కొట్టేసిన హాట్ భామ.. ఎవరామె?
సినీ పరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యినవారు కూడా ఉన్నారు. కాగా ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో అయితే కొందరు యూట్యూబ్, వెబ్ సిరీస్‌లు లేదా ఓటిటి సిరీస్‌లు ఇవీ కాకపోతే కొంచెం టాలెంట్ ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకొని అవకాశాలు అందుకుంటున్నారు.
మొదట్లో రీల్స్, టిక్ టాక్ లాంటివి చేసే వాళ్ళని తీసుకోము అంటూ చెప్పేవారు మేకర్స్. కానీ ఇప్పుడు మాత్రం ఏ ఛానెల్లో చూసినా, సినిమాలో చూసినా ఈ సోషల్ మీడియా చుక్కలే కనిపిస్తున్నారు. ఇలా జస్ట్ ఒక్క రీల్ తోనే ఓ హాట్ బ్యూటీ భారీ పాన్ ఇండియా చిత్రం "పుష్ప 2" లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. కాగా ఆమె పేరే ఆంచల్ ముంజల్. ఈ వివరాల్లోకి వెళితే.. పుష్ప 2 చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఓ భారీ డీల్ కోసం మాల్దీవ్స్ వెళ్లే సీన్ బీచ్ దగ్గర ఉంటుంది.

ఈ సీన్‌లో అల్లు అర్జున్‌ని ఎలివేట్ చేస్తూ బాలీవుడ్ నటుడు గత ఏడాది ఆనిమల్ సినిమాలో కనిపించిన సౌరభ్ సచ్ దేవ్ తో ఓ సన్నివేశం ఉంటుంది. కాగా ఈ సీన్ లో తనకి గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న కొంచెం సేపు కూడా ఈమె మంచి హాట్ షో చేసి అందరి దృష్టి ఆకర్షించింది. కాగా ఈమెకి పుష్ప 2 లో ఛాన్స్ పుష్ప 2 వల్లే వచ్చింది అని ఇపుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటికి వచ్చింది.
అయితే ఈమె రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తాను పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప సాంగ్ రీల్ చేసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశానని ఆంచల్ అన్నారు. ఎలాంటి ఎడిట్ లేకుండా సింపుల్ గా సింగిల్ టేక్‌లోనే చేసేసాను అని చెప్పుకొచ్చింది. కానీ అది పెట్టాక ఆ రీల్ రీచ్ చూసి తానే షాకయ్యా అని చెప్పింది. షేర్ చేసిన కాసేపటికే దానికి 5 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.
ఒక్క రోజులోనే 9 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అంటూ ఆంచల్ చెప్పింది. కాగా ఈ రీల్ రీచ్ తర్వాత తనకో ఫోన్ కాల్ వచ్చిందట. అది కూడా డైరెక్ట్ గా సుకుమార్ టీం నుంచే కాల్ చేస్తూ సినిమాలో అవకాశం ఇస్తున్నామని చెప్పారు అని తెలిపింది. ముందు తాను ఇది నమ్మలేదని.. అదంతా ఫేక్ కాల్ అని , ఎవరో తనను ఏడిపించడానికి ఇలా చేస్తున్నారని ఆంచల్ అనుకున్నారట.
కానీ తర్వాత సుకుమార్ గారు ఆ రీల్ చూసి తన రోల్ కి ఆమె బాగుంటుందని డిసైడ్ అయ్యాకే కాల్ చేసారని అసలు విషయం తెలుసుకొని షాకయ్యానని ఆమె వెల్లడించారు. నిజంగానే పుష్ప 2 నుంచి వచ్చిన ఆఫర్ అని తెలిసి వెంటనే ఓకే చేసేసాను అని తెలిపింది. సో ఇలా చిన్న రీల్ తో ఆమె తన లైఫ్ లో బిగ్గెస్ట్ ఆఫర్ పట్టేసింది అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా ఏ సినిమా రీల్ అయితే ఆమె చేసిందో అదే సినిమాలో ఆఫర్ అందుకోవడం అనేది ఒకింత ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











