‘కుర్ర హీరోయిన్లతోనే మజా .. పెళ్లయిన హీరోయిన్లతో మూడ్ రాదు’

ఇటీవలి కాలంలో సీనియర్ హీరోలకు హీరోయిన్లుగా చేసే వారి విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ కూతురు, మనవరాలు వయసున్న వారితో స్టార్స్‌తో రొమాన్స్ చేస్తుండటంతో ట్రోలింగ్ జరుగుతోంది. సీనియర్ హీరోలు తమ అనుభవం, ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో రష్మిక మందన్న జోడీ కట్టినప్పుడు ఇది తారాస్థాయికి చేరింది. ఇక తెలుగులో రవితేజ- భాగ్యశ్రీ బోర్సేల కాంబోపైనా పెదవి విరిచారు. తాజాగా నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు మాధవన్.

హ్యాండ్సమ్ హీరోగా పాపులర్
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా మాధవన్‌కు లేడీస్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తమకు కాబోయే భర్త మాధవన్‌లా ఉండాలని అమ్మాయిలు ఆశపడేవారంటే అతిశయోక్తి కాదు. సఖి, చెలి, గురు తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి కూడా మాధవన్ బాగా దగ్గరయ్యారు. మూడు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, మాలే తదితర భాషల్లో ఆయన నటించారు.

Aap Jaisa Koi Actor R Madhavan on about Age Gap with Fatima Sana Shaikh

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్
ప్రేమకథలు, కుటుంబ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. వయసు పెరుగుతుండటంతో హీరోగా నటించడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కథాబలమున్న పాత్రలను పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సౌత్‌ను పక్కనపెట్టి ఎక్కువగా హిందీ సినిమాలలోనే నటిస్తున్నారు. ఈ ఏడాది టెస్ట్ , కేసరి చాప్టర్ చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు మాధవన్. ప్రస్తుతం ఆప్ జైసా కోయి, దే దే ప్యార్ దే 2, ధురందర్, అదృష్టశాలి సినిమాలలో ఈ సీనియర్ హీరో నటిస్తున్నారు.

SSMB29లో మాధవన్?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 29లో మాధవన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. మహేశ్‌కు తండ్రిగా మాధవన్ నటించనున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తొలుత ఈ పాత్రకు చియాన్ విక్రమ్‌ను సంప్రదించగా ఆయన నో చెప్పడంతో మాధవన్‌ను రాజమౌళి సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై చిత్ర యూనిట్ కానీ, మాధవన్ కానీ స్పందించలేదు.

ఆప్ జైసా కోయి ప్రమోషన్స్‌లో బిజీ
ప్రస్తుతం వివేక్ సోని దర్శకత్వంలో ఆప్ జైసా కోయి సినిమాలో నటించారు. ఇందులో మాధవన్ సరసన దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గా నటించారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జూలై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాధవన్ చురుగ్గా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఫాతిమాతో ఏజ్ గ్యాప్‌పై ప్రశ్నలు రావడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు.

Take a Poll

పెళ్లయిన హీరోయిన్లతో కష్టం
కో స్టార్స్‌తో మనకు ప్రేమ ఉండాలని.. అప్పుడే ఆన్ స్క్రీన్‌పై కెమెస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మన ఎదురుగా ఉన్న నటీనటులపై కొంచెమైనా రొమాంటిక్ ఫీలింగ్ ఉండాలని లేదంటే దానిని నమ్మలేమని ఆయన అన్నారు. అయితే పెళ్లయిన నటీనటులు రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగా నటించలేరని మాధవన్ బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లయిన హీరోయిన్లు తెరపై రొమాంటిక్ ఫీలింగ్ కలిగించడం కష్టమని మాధవన్ వ్యాఖ్యానించారు. అలాగే నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదని.. సినిమాకు కథే బలమన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించడంలో మార్పు వచ్చిందని .. ఆ తరహా సినిమాలు ఇప్పుడు రావడం లేదని మాధవన్ వెల్లడించారు.

More from Filmibeat

Read more about: r madhavan fatima sana shaikh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X