అమ్మాయిలేం సుద్ధపూసలు కాదు.. జానీ మాస్టర్ కేసుపై ఆట సందీప్ వైఫ్ షాకింగ్ రియాక్షన్
టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం చర్చనీయాంశమైంది. తన వద్ద పనిచేసే మహిళా అసిస్టెంట్‌పై అత్యాచారంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా జానీపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. రెండ్రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ సతీమణి జ్యోతి స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. బాధితురాలికి అండగా నిలవడంతో పాటు ఓ ప్రముఖ సంస్థలో ఆమెకు అవకాశం కల్పించినట్లుగా ఛాంబర్ తెలిపింది, ఓ ప్రముఖ హీరో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా వెల్లడించింది. అలాగే తోటి కొరియోగ్రాఫర్లు కూడా జానీ మాస్టర్ వివాదంపై స్పందిస్తున్నారు.

హీరో మంచు మనోజ్ కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు. మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసునని.. మీపై ఇలాంటి ఆరోపణలు రావడంతో నా గుండె ముక్కలవుతోందన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు పారిపోవడం మంచిది కాదని.. తప్పు లేకపోతే పోరాడాలని, తప్పుంటే ఒప్పుకోవాలని మనోజ్ సూచించారు. సినీ పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలబడాలని.. ఈ పరిస్ధితుల్లో అండగా నిలిచిన పెద్దలు, సహోద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు తర్వాత జానీ మాస్టర్ పారిపోవడం దుమారం రేపింది. దీనిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఆయన కోసం పోలీస్ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జానీ మాస్టర్‌ను తొలుత బెంగళూరులో అదుపులో తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పక్కా సమాచారం మేరకు గోవాలోని లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్న విషయం తెలుసుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ఇదిలాఉండగా.. జానీ మాస్టర్ కేసుపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ సతీమణి జ్యోతి స్పందించారు. ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె.. డైరెక్ట్‌గా జానీ మాస్టర్ అని చెప్పకుండా మాట్లాడింది. ఇలాంటి అన్యాయాలకు బలైపోయిన ఎంతోమంది అమ్మాయిలకి తాను అండగా నిలిచానని.. నిందితులు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టకూడదన్నారు. కానీ ఇదే సమయంలో చట్టాలను ఉపయోగించుకుని.. ఓ వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న పేరుని, ఇమేజ్‌ను చెడగొట్టాలనుకునే అమ్మాయిల్ని కూడా శిక్షించాలని జ్యోతి సూచించారు. అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారని.. నిజం ఏదో ఒక రోజు బయటికి వస్తుందని జ్యోతి అభిప్రాయపడ్డారు. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి.. జానీ మాస్టర్‌ను వెనకేసుకొస్తున్నావా అంటూ మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











