ఆవేశం మూవీ కలెక్షన్లపై పైరసీ దెబ్బ.. ఫాహద్ ఫాజిల్ ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో లీక్!
మలయాళ సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ల జైత్రయాత్ర కొనసాగుతున్నాయి. 2024 సంవత్సరంలో బాక్సాఫీస్‌ను చిన్న సినిమాలు కుదిపేస్తున్నాయి. ప్రేమలు, బ్రమయుగం, ఆడు జీవితం లాంటి సినిమాల తర్వాత ఆవేశం సినిమా రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. పాహద్ ఫాజిల్, ఆశీష్ విద్యార్థి, సజిన్ గోపు, ఇతర యువ హీరోలు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నది. అయితే ఈ కలెక్షన్ల యాత్రకు గండి కొట్టేలా ఈ మూవీ ఫుల్ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆవేశం సినిమా ఏప్రిల్ 11వ తేదీన మలయాళం, ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. సగటున ప్రతీ రోజు 3 కోట్లకుపైగా కలెక్షన్లను రాడుతున్నది. ఇప్పటికే ఈ సినిమా కేవలం మలయాళం బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలను దాదాపుగా వసూలు చేసింది.

ఇండియా వైడ్‌గా 1వ రోజు 3.7 కోట్లు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 5 కోట్లు, ఐదో రోజు 4 కోట్లు, ఆరో రోజు 4 కోట్లు, ఏడో రోజు 3.6 కోట్లు, ఎనిమిదో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఆవేశం సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికా, ఇతర దేశాల్లో 28 కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఇండియాలో 35 కోట్ల గ్రాస్, 30 నికర వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 8 రోజుల్లో 63 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇలా కలెక్షన్ల ప్రవాహం కొనసాగిస్తున్న ఆవేశం సినిమాపై పైరసీదారులు దెబ్బ తీశారు. ఈ సినిమాను ఫుల్లుగా హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా పైరసీ ప్రింట్ తమిళ్ రాకర్స్, తమిళ్ బ్లాస్టర్స్ లాంటి సైట్లలో లభ్యమవుతున్నాయి. దాంతో ఈ సినిమా వసూళ్లపై భారీ ప్రబావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











