‘ఆయ్’టీమ్ సంచలన ప్రకటన.. కలెక్షన్స్‌లో భారీ వాటా వారేనంట !
గత మూడ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు. విజయవాడ నగర ప్రజలైతే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో తెలుగు దేశం పార్టీ నేతలు దగ్గరుండీ మరీ సహాయక చర్యలు అందిస్తున్నారు. ఎంతో మంది వరద బాధితులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత అయిన బన్నీ వాసు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో రిలీజైన ఆయ్ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇవాళ నుంచి వచ్చే వసూళ్లలో వరద బాధితులకు 25 శాతం జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేస్తాం' అని ప్రకటించాడు. జై పాలకొల్లు.. లవ్ యూ పవన్ కళ్యాణ్.. ప్రశంసలు కుప్పించారు. దీంతో అభిమానులు బన్నీ వాసుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

నిర్మాత బన్నీ వాసు నిర్మించిన సినిమాలు
కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మొగాడివోయ్, తదుపరి నువ్వే, గీత గోవిందం, ప్రతి రోజు పండగే, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్ పేజీలు, వినరో భాగ్యము విష్ణు కథ, కోట బొమ్మాళి PS, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోన్న ఆయ్ వంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు విన్నపం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు తెలిపారు. అలాగే.. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలను పాల్గొనాలని సూచించారు. ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.


Click it and Unblock the Notifications











