విశాల్ దర్శకుడితో అఖిల్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా!
అక్కినేని అఖిల్ సినిమాలు విషయంలో జోరు పెంచినట్లే కనిపిస్తున్నాడు. తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అఖిల్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తిర వార్తలు వస్తున్నాయి.
అఖిల్ ఓ తమిళ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకుడు. ఇటీవల మిత్రన్ అఖిల్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. కథ బావుండడంతో పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అఖిల్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మలుపు చిత్ర దర్శకుడు సత్య ప్రభాస్ తో కూడా అఖిల్ కు కమిట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిస్టర్ మజ్ను తరువాత అఖిల్ ఏ దర్శకుడితో ముందుగా సినిమాని ప్రారంభిస్తారో చూడాలి. మిస్టర్ మజ్ను చిత్రం జనవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ అఖిల్ కు జోడిగా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











