యువ హీరోయిన్‌తో అఫైర్ గురించి అభినవ్ గోమటం క్లారిటీ.. ఆ గొడవ తర్వాత చచ్చిపో అంటూ!

తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో యువ నటుడు అభినవ్ గోమటం రాణిస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది నుంచి స్పై చిత్రం వరకు ఎన్నో విభిన్నమైన పాత్రనలను పోషిస్తూ ఆకట్టుకొంటున్నాడు. తాజాగా యువ హీరోయిన్ కల్పికతో గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. తనతో జరిగిన గొడవ వెనుక కారణాలను వెల్లడిస్తూ..

యువ హీరో కల్పికతో నాకు అఫైర్‌ లేదు. ఆమె సినిమా పరిశ్రమలో పరిచయం ఉన్న ఫ్రెండ్ మాత్రమే. అప్పుడప్పుడూ ఛాటింగ్ చేసుకొంటాం. ఒక రోజు ఆమె నాకు ఓ అవార్డు వచ్చిందని మెసేజ్ చేసింది. దాంతో నేను కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశాను. అయితే ఆ విషయం మీద నాతో వాగ్వాదానికి దిగింది అని అభినవ్ గోమటం వెల్లడించాడు.

 Abhinav Gomatam clarity on Affair With Actress Kalpika

కల్పికతో ఛాటింగ్ చేస్తుంటే నాకు నారీమణి అవార్డు వచ్చిందని చెప్పింది. అయితే ఆ అవార్డు గురించి నాకు తెలియదని చెప్పాను. నాకు వచ్చిన అవార్డు గురించి నీకు తెలియదా? అని ప్రశ్నించింది. అయితే అది పాపులర్ అవార్డు కాదుగా.. నాకు తెలియడానికి అంటే.. నాకు అవార్డు ఇస్తే దానిని కించపరుస్తావా? అంటూ ఫైర్ అయింది అని అభినవ్ చెప్పాడు.

అవార్డు విషయంపై మా మధ్య ఛాటింగ్ చేస్తూనే గొడవ పడ్డాం. అయితే ఆ చాటింగ్ చూసిన తర్వాత ఏదో జరగకూడనిది జరుగుతుందనే ఫీలింగ్ కలిగింది. ఆమె మెసేజ్ పెడితే.. నేను ఎందుకు మెసేజ్ ఇస్తున్నానని అనే ఫీలింగ్ కలిగింది. ఫ్రెండ్ అని ఆమెతో నేను ఛాటింగ్ చేస్తుంటే.. నన్ను బూతులు తిట్టింది. స్త్రీద్వేషి అని కామెంట్ చేసిందని అభినవ్ గోమటం అన్నాడు.

 Abhinav Gomatam clarity on Affair With Actress Kalpika

కల్పిక గురించి మాట్లాడుతూ.. అభినవ్ గోమటం చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రవర్తన సరికాదు. ఆమె పనిచేసిన ప్రతీ సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్కరితో గొడవ పడిందనే విషయం నాకు లేటుగా తెలిసింది. నన్ను బూతులు తిట్టి.. నాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మా మధ్య ఛాటింగ్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది అని అభినవ్ గోమటం తెలిపాడు.

అవార్డు గురించి మా మధ్య జరిగిన ఛాటింగ్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయడం మంచి పని జరిగిందనిపించింది. నేను ఏమన్నానో అందరు తెలుసుకొన్నారు. చాలా మంది నాకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. నీ తప్పే ఏమీ లేదని చెబుతున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది అని అభినవ్ గోమటం చెప్పాడు.

 Abhinav Gomatam clarity on Affair With Actress Kalpika

కల్పికతో నాకు ఎలాంటి లవ్ లేదు. ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ.. నాపై దారుణంగా కామెంట్ చేసింది. మహిళలను కించపరిచినందుకు ఆయన సూసైడ్ చేసుకోవాలని అన్నది. నాపై యూట్యూబ్‌లో కామెంట్స్ చేస్తూ.. నాపై ఆర్టికల్ కూడా రాయించింది. కేవలం నేను నారీశక్తి అవార్డు తెలియదని చెప్పడం నా తప్పు. దానికి ఇంత రచ్చ చేసింది అని అభినవ్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X