Abhinaya Wedding : ఘనంగా అభినయ వివాహం.. ప్రియుడితో ఏడడుగులు.. ఫోటోలు వైరల్

పుట్టుకతోనే మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్నారు అభినయ. ఏ పాత్రకైనా నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటిగా నిలిచారు అభినయ. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ నటిగా ఆమె కొనసాగుతున్నారు. అభినయ ప్రేమ, పెళ్లిపై గత కొద్దినెలలుగా మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క ఫోటోతో అన్ని పుకార్లకు తెరదించారు అభినయ.

రవితేజ హీరోగా వచ్చిన నేనింతే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అభినయ అనంతరం కింగ్, సంగమం, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్ తదితర చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో వెంకటేష్ - మహేశ్ బాబుల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వారిద్దరికీ చెల్లెలిగా నటించి పాపులర్ అయ్యారు అభినయ. ఈ సినిమా తర్వాత ఆమె ప్రతిభ, నేపథ్యం అందరికీ తెలిశాయి. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక గతేడాది మలయాళంలో వచ్చిన పని చిత్రంలో అభినయ అద్భుతంగా నటించారు. అయితే ఇందులో అభినయపై అత్యాచార ఘటనపై విమర్శలు వచ్చాయి. దీనిపై అభియన తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

Abhinaya and Sunny Varma finally tied the knot Marriage pics goes viral

అభినయ సినిమాలు చూసిన చాలా మందికి ఆమెకు మాటలు రావు, వినపడదంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నటన ఆమెకు భగవంతుడు ఇచ్చిన వరం. కేవలం సైగలతో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే అభినయ అసిస్టెంట్ దానికి అర్ధాన్ని వివరిస్తారు. ఇండస్ట్రీలో అందరు నటీనటుల మాదిరిగానే అభినయ మీద కూడా లెక్కలేనన్ని గాసిప్స్ వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.. మార్క్ ఆంటోనీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని.. అది పెళ్లిదాకా వెళ్లబోతోందని కథనాలు వచ్చాయి. అయితే విశాల్, అభినయ పలుమార్లు ఈ పుకార్లను ఖండించారు.

ఇటీవల అభినయ షాకిచ్చారు. ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తొడిగి ఉన్న చేతులతో ఉన్న ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. ఆ తర్వాత కాబోయే భర్త గురించిన వివరాలు పంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వీ. కార్తీక్ (సన్నీ వర్మ)తో అభినయ పెళ్లి కుదిరింది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని.. దాదాపు 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. సన్నీ వర్మ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఎంఎన్‌సీ కంపెనీలో కీలక హోదాలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.

తాజాగా సన్నీ వర్మ - అభినయల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వాహం జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోనే గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: abhinaya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X