‘అభినేత్రి 2’ టీజర్: షాకింగ్ ట్విస్ట్... ప్రభుదేవా కూడా దెయ్యమే!

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌ ప్రధాన పాత్రల్లో ఎఎల్ విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన 'అభినేత్రి' 2016లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా 'అభినేత్రి 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. ఇందులో ఓ షాకింగ్ ట్విస్ట్ బయటపెట్టారు. మొదటి భాగంలో కేవలం తమన్నా మాత్రమే రూబీ అనే దెయ్యం పాత్రలో కనిపించింది. త్వరలో రాబోతున్న సీక్వెల్‌లో ప్రభుదేవాను అలెక్స్ అనే దెయ్యం ఆవహిస్తుందని తెలుస్తోంది. ఈ సారి మూవీలో 2 దెయ్యాలు కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

దెయ్య‌మా? ఒక‌టి కాదు..రెండు దెయ్యాలు అంటూ కోవై స‌ర‌ళ చెప్పే డైలాగ్ టీజ‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. గృహిణి పాత్ర‌లో త‌మ‌న్నా లుక్స్, డ‌బుల్ షేడ్స్ ఉన్న కేర‌క్ట‌ర్‌లో ప్ర‌భుదేవా మెప్పించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించే సినిమా అవుతుంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే, మ‌న‌సుకు న‌చ్చే ఆహ్లాద‌క‌రమైన స‌న్నివేశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేతా పెర్ఫార్మెన్స్‌లు హైలైట్ అవుతాయి. శామ్ సంగీతం అంద‌రినీ త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్లస్ అవుతుంది' అన్నారు.

Abhinetri 2 First Look Teaser release

మే 1న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. ఇప్ప‌టికే టీజ‌ర్ చూసిన వాళ్లంద‌రూ చాలా బావుందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఆయంక బోస్‌, సంగీతం: శామ్ సి.ఎస్‌., ఎడిటింగ్‌: ఆంట‌నీ.

More from Filmibeat

Read more about: abhinetri prabhu deva tamannah
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X