షాక్: తమన్నాను కాదన్న ప్రభుదేవా ఇంకో హీరోయిన్ వెంట బడుతున్నాడు చూడండి

చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే.. అంటూ హీరో ప్రభుదేవా హీరోయిన్ నందితా శ్వేత వెంట పడుతున్నారు. తమన్నాను కాదన్న ఆయన ఈమె వెంట పడటం ప్రేక్షకుల్లో ఆసక్తి నింపుతోంది. ఆశ్చర్యపోకండి.. అభినేత్రి సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న అభినేత్రి 2 గురించి మనం చెప్పుకునేది. ఇటీవలే భార్యభర్తల శృంగార నేపథ్యంలో సాగే సాంగ్ విడుదల చేసి ఆసక్తి రేపిన ఈ చిత్రయూనిట్ తాజాగా మరో సాంగ్ తో ఆకట్టుకుంది. ఆ వివరాలేంటో చూద్దామా..

రెడీ రెడీ రెడీ ఐయామ్ రెడీ

రెడీ రెడీ రెడీ ఐయామ్ రెడీ అంటూ సాగే పాటను తమిళంలో ప్రభుదేవా రాయగా.. తెలుగు సాహిత్యాన్ని వనమాలి అందించారు. నిన్సీ విన్సెంట్ ఆలపించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఈ పాటలో సాహిత్యానికి తగ్గట్టుగా తమన్నా పిచ్చ పిచ్చగా రెచ్చిపోయింది. స్టెప్పులు, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు ఫీజులు ఎగరగొట్టేసింది.

ప్రభుదేవాతో రొమాన్స్‌ కోసం

హీరో ప్రభుదేవాను రొమాన్స్‌ కోసం రెచ్చగొడుతూ తమన్నా చూపిన హావభావాలు బాగా ఆకట్టుకున్నాయి. తమన్నా ఎంతలా రెచ్చగొట్టినా ప్రభుదేవా మాత్రం ఆమెతో రొమాన్స్ చేసేందుకు వెనుకాడటం ఈ పాటలో చూపించారు. అయితే తాజాగా అందుకు భిన్నంగా మరో పాటతో ఆకట్టుకుంది చిత్రయూనిట్.

నందితాశ్వేత వెంట పడుతూ

నందితాశ్వేత వెంట పడుతూ

తాజాగా విడుదల చేసిన పాటలో నందితాశ్వేత వెంట పడుతూ ప్రభుదేవా కనిపించారు. చక్కని పిల్లా చక్కర బిళ్లా చిక్కని సోకుతో చంపొద్దే.. అంటూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నారు ప్రభుదేవా. ఫాస్ట్ బీట్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందీ సాంగ్. చిత్రంలో ప్రభుదేవా. నందిత శ్వేత మధ్య ఆసక్తికర సన్నివేశాలు చూడొచ్చని ఈ సాంగ్ చెప్పకనే చెప్పేస్తోంది.

అభినేత్రి 2 మూవీ

అభినేత్రి 2 మూవీ

2016లో వచ్చిన చిత్రం ‘అభినేత్రి' సినిమాకు సీక్వల్‌గా అభినేత్రి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. తొలిభాగాన్ని తెరకెక్కించిన విజయ్‌ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. తమిళ్‌లో దేవి 2 పేరుతో, తెలుగులో అభినేత్రి 2 పేరుతో మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X