For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎట్టకేలకి ఆ విషయంలో నోరు విప్పిన అభిరామ్.. తప్పు చేశా, కానీ అండగా ఉన్నారు.. తేజతో సినిమా కూడా!

  |

  సరిగ్గా రెండేళ్ల క్రితం కాస్టింగ్ కౌచ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మొదలైన ఈ వ్యవహారం చివరికి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దాకా వెళ్ళింది. అయితే ముఖ్యంగా ఈ అంశంలో శ్రీరెడ్డి ఎక్కువగా ప్రస్తావించింది, ఫోటోలు లీక్ చేసింది దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్ వే. అయితే ఈ విషయం గురించి దగ్గుబాటి ఫ్యామిలీ కానీ ఇటు అభిరామ్ గానీ ఎప్పుడూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు అభిరామ్.. ఆ వివరాల్లోకి వెళితే

   లైంగిక వేధింపులు

  లైంగిక వేధింపులు

  దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు దగ్గుబాటి అభిరామ్. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చే కొన్ని సినిమాలకు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటారు. రాణా సోదరుడు అయిన అభిరామ్ తనను మోసం చేసి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించాడు అని శ్రీరెడ్డి అప్పట్లో సంచలనం రేపింది. ఈ అంశం మీద పెద్ద ఎత్తున వివాదం కూడా నడిచింది.

  కానీ నో రెస్పాన్స్

  కానీ నో రెస్పాన్స్

  ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనకి దిగడంతో సినిమా పెద్దలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి సినిమాల్లో లైంగిక వేధింపులు ఉంటే ఆడపిల్లలు ఫిర్యాదు చేయడం కోసం ఒక కమిటీని కూడా నియమించారు. ఇప్పటికీ ఫిలిం చాంబర్లో ఆ కమిటీ కార్యాలయం ఉంది. అలాగే ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఇక ఇంత జరిగినా సరే దగ్గుబాటి సురేష్ బాబు కానీ ఆ కుటుంబం కానీ ఈ అంశం మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

  ఎట్టకేలకు నోరు విప్పాడు

  ఎట్టకేలకు నోరు విప్పాడు

  ఆ తరువాతి రోజుల్లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఒక సినిమా వస్తుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా అభిరామ్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన శ్రీరెడ్డి ఇష్యూ సహా అనేక విషయాల గురించి ఓపెన్ అయ్యారు.

  తేజతో సినిమా

  తేజతో సినిమా

  తేజ దర్శకత్వంలో తాను హీరోగా ఒక సినిమా చేస్తున్నానని దగ్గుబాటి అభిరామ్ వెల్లడించారు. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు అని కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా షూటింగ్ మొదలు పెడతాం అని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచేలాగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ సమయంలో తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న నేపథ్యంలో తేజకు తనకు మధ్య అనుబంధం పెరిగిందని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆయన మీ కోసం ఒక కథ రాస్తానని అంటూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు.

   తప్పు జరిగింది నిజమే

  తప్పు జరిగింది నిజమే

  ఇక ఇదే సమయంలో యాంకర్ ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరైనా హీరోలు అయ్యాక వాళ్ళకి పేరు వస్తుంది అనుకుంటే ఇలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయని కానీ మీరు హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశం అలాగే కార్ యాక్సిడెంట్ విషయాలు వెలుగులోకి వచ్చాయి కదా దీని మీద మీ స్పందన ఏమిటి అని అడిగారు. దానికి అభిరామ్ ఆసక్తికరంగా స్పందించాడు. తప్పులు చేయని మనుషులు ఉండరు అని చెప్పుకొచ్చిన ఆయన ఇది తప్పు అనే విషయం తనకు తర్వాత తెలిసిందని, ఇకమీదట ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని అన్నారు. తాను హీరో కాకముందే ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఆ తప్పులు ఇక జరగవని ఆయన చెప్పుకొచ్చారు.

   అండగా ఉన్నారు

  అండగా ఉన్నారు

  ఇక ఈ విషయం జరిగిన సమయంలో తన కుటుంబం అంతా తనకు అండగా నిలబడింది అని ఇక మీదట తప్పులు చేయకుండా ఎలా మసలుకోవాలో వాళ్ళు నాకు చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. ఇక తాను హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదని ప్రొడ్యూసర్ గా మారదాము అనేది తన ఆలోచనని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలు చేస్తాను అలాగే హీరోగా అవకాశం వచ్చినా చేస్తాను అని అభిరామ్ పేర్కొన్నారు.

  English summary
  Ever since Telugu actress Sri Reddy started talking about casting couch, a lot has been written about the issue. She went on to reveal about her alleged affair with producer Abhiram Daggubati and even released some intimate pictures. there is no response from daggubati family about this. but recently daggubati abhiram opened up regarding this issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X