‘అబ్దుల్ కలాం’ జీవితంపై బయోపిక్: తెలుగు నిర్మాత అఫీషియల్ ప్రకటన
భారతీయ సినీ పరిశ్రమలో వరుస బయోపిక్స్ రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలో మరో ప్రముఖుడి జీవితం వెండితెరపైకి రాబోతోంది. ఇండియన్ మాజీ ప్రెసిడెంట్, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపిజె అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. అనిల్ సుంకరతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలిపారు.
తాజాగా ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ..'అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నాం. త్వరలో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా లాంచ్ చేస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లాచింగ్ సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తాము' అన్నారు.
ఈ బయోపిక్ తీయడానికి కలాం ఫ్యామిలీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు అభిషేక్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి కారణాలను వెల్లడిస్తూ... 'ప్రముఖుల జీవితాల ఆధారంగా మంచి సినిమాలు చేయాలనుకున్నాం. యువతకు స్పూర్తి నిచ్చే ప్రాజెక్టుతో ముందుకు రావాలనుకున్నాం. ఆ సమయంలో అబ్దుల్ కలాం బయోపిక్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. మహాత్మాగాంధీ తర్వాత దేశ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన, కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి కలాం స్పూర్తిగా నిలిచాడు.' అన్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటుల ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం అభిషేక్ అగర్వాల్ 'గూఢచారి 2' ప్రాజెక్టుపై బిజీగా గడుపుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం చేయబోతున్నారు.
గూఢచారి 2, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అభిషేక్ అగర్వాల్‌తో కలిసి సినిమాలు తీస్తున్న నిర్మాత అనిల్ సుంకర తన తాజా చిత్రం 'సీత' విడుదలకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











