twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 విజయం స్వర్గీయ నారాయణ దాస్ నారంగ్ అంకితం - అభిషేక్ అగ‌ర్వాల్ ఎమోషనల్

    |

    యువ హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ‌ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, చందూ మొండేటి, నిర్మాతలు అభిషేక్ అగర్వలాల్, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ తదితరుల పాల్గొన్నారు.

    గత రెండేళ్లుగా రెండు పాండమిక్స్ తర్వాత కార్తీకేయ 2 చిత్రం రిలీజైంది. ఈ సినిమా సక్సెస్‌‌తో ఆ కష్టం అంతా మర్చిపోయా. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి చాలా ఎమోషనల్ ఐపోయాను. చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ ఫర్ యూ సపోర్ట్ అని చందూ మొండేటి అన్నారు.

    కార్తీకేయ 2 సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. చాలా మంది ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఈ సినిమాకు కృష్ణ భగవానుడి దీవెనలు ఉన్నాయి. వీకెండ్స్‌లో కూడా బుకింగ్స్ బాగున్నాయి. మా దర్శకుడు చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీసాడు అని చెబుతూ కార్తికేయ టెక్నీషియన్స్ కృతజ్ఞతలు అని హీరో నిఖిల్ తెలిపారు.

    Abhishek Agarwal dedicated Karthikeya 2 success to Narayana Das Narang

    ఇక కార్తీకేయ 2 అంచనాలకు మంచి విజయం సాధించడంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఎమోషనల్ అయ్యారు. ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ స్వర్గీయ నారాయణ దాస్ నారంగ్‌కు కార్తీకేయ 2 విజయం అంకింతం అని అన్నారు. ఇటీవల వృద్ద్యాప సంబంధిత వ్యాధులతో నారాయణ దాస్ నారంగ్ మరణించిన సంగతి తెలిసిందే.

    కార్తీకేయ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.5 కోటల్ షేర్, 5.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 5.05 కోట్ల షేర్, 8.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    English summary
    Nikhil and Chandoo Mondeti's Karthikeya 2 movie has release on August 13th. Here are the photos from the success meet. In this occassion, Producer Abhishek Agarwal dedicated Karthikeya 2 success to Narayana Das Narang
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X