twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెజాన్‌లో నిత్యమీనన్‌ బ్రీత్.. జూలై 10న గ్రాండ్‌గా అభిషేక్‌ బచ్చన్‌తో

    |

    బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ డిజిటల్ మీడియాలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన బ్రీత్: ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే ప్రసారం కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ కేక పెట్టించింది. ఈ చిత్రంలో అమిత్ సద్, నిత్యా మీనన్, సైయామీ ఖేర్ నటిస్తున్నారు.

    తాజాగా అభిషేక్ షేర్ చేసిన పోస్టర్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్‌లో ముక్కలైన మాస్క్ మధ్య ఓ చిన్నారి పడుకొని ఉండటం కనిపించింది. ఆమె ఛాయల మధ్య పడుకొని ఉంది. దేని కోసమో వెతుకుతున్నది. జూలై 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నది.

    Abhishek Bachchan grand digital debut with Breathe: Into The Shadows

    బ్రీత్ సీరిస్‌ అమెజాన్‌లో సక్సెస్ అయిన తర్వాత మరోసారి అభిషేక్ బచ్చన్‌తో భాగస్వామ్యం పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నిత్య, సయామీ, యయాంక్ లాంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించడంతో ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. సరికొత్త కథ, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది అని అమెజాన్ ప్రైమ్ వీడియో సీఈవో విక్రమ్ మల్హోత్రా అన్నారు.

    Abhishek Bachchan grand digital debut with Breathe: Into The Shadows

    నిత్య మీనన్‌ విషయానికి వస్తే సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇక దక్షిణాది సినిమాలే బాలీవుడ్‌ చిత్రాలు, హిందీ వెబ్ సిరీస్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలీవుడ్‌లో మిషన్ మంగళ్ తర్వాత ఇప్పుడు బ్రీత్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

    English summary
    Abhishek Bachchan grand digital debut with Breathe: Into The Shadows. Nitya Menon also making her debut in hindi web series, This going to release on July 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X