ఐశ్వర్య నా దృష్టిలో అప్సర.. ఆ స్టార్ హీరోయిన్‌తో పడుకోవాలనుకొన్నా.. అభిషేక్ బచ్చన్ చిలిపి చేష్టలు
బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధికంగా వినిపించే రూమర్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారం ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంటుంది. అయితే అభిషేక్‌పై ఐశ్వర్య గానీ, ఐశ్వర్యపై అభిషేక్ గానీ ఎలాంటి కామెంట్లు చేసినట్టు ఎక్కడా కనిపించదు. అలాగే బచ్చన్ ఫ్యామిలీపై ఐశ్వర్య కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా తనదైన శైలిలో లైఫ్ లీడ్ చేస్తున్నది. అయితే ఇలాంటి వార్తల నేపథ్యంలో అభిషేక్‌కు సంబంధించిన ఓ వీడియో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో పాపులర్ షోలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్ పాల్గొన్నారు. ఆ షోకు రితేష్ దేశ్ ముఖ్, మరో వ్యక్తి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ఐదుగురు చిలిపి వ్యక్తులు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టం. అలాంటి వ్యక్తుల ఓ షోలో కలిశారు. ఇంకేముంది హీరొయిన్ల గురించి చిలిపి ముచ్చట్లు మాటల సందర్భంలో స్వైర విహారం చేశాయి. రితేష్ అడిగే కొంటే ప్రశ్నలకు ఆ ముగ్గురు రెచ్చిపోయి సమాధానం ఇచ్చారు.

సంజయ్, అభిషేక్, అజయ్‌ను రితేష్ ఓ ప్రశ్న అడుగుతూ మీ దృష్టిలో అప్సర అంటే ఎవరు? అని అడిగితే.. అభిషేక్ తన సమాధానంగా ఐశ్వర్య అని, మధుబాల పేరును అజయ్, వైజయంతి మాల పేరును సంజయ్ చెప్పారు. ఇక మంచి డ్యాన్సర్ ఎవరని అడిగితే.. అందరూ ముక్త కంఠంతో మాధురీ దీక్షిత్ అంటూ సమాధానం చెప్పారు. మరో ప్రశ్న అడిగితే..అభిషేక్ ఐశ్వర్య పేరు చెబితే.. ఇక లాభం లేదు.. ప్రతీ ప్రశ్నకు ఐశ్వర్య పేరే చెబుతాడు అంటూ ఆట పట్టించారు.
ఇక మీకు ఇష్టమైన హాట్ నటి ఎవరు? అంటే అభిషేక్ జీనత్ ఆమన్ అని సతమాధానం చెప్పాడు. అయితే జీనత్ ఆమన్‌తో నీకు ఓ మరిచిపోలేని సంఘటన ఉంది కదా.. అదేంటో చెప్పాల్సిందే అని రితేష్ పట్టుబట్టాడు. అయితే వద్దులే అని వారిస్తే.. సరే అని తన చిన్నతనంలో జరిగిన సంఘటనను చెప్పారు.

జీనత్ ఆమన్ గురించి చెబుతూ.. తన దృష్టిలో జీనత్ ఆమన్ గొప్ప అందగత్తే.. మహాన్ అనే సినిమా కోసం నాన్న అమితాబ్‌తో కలిసి బయటకు వెళ్లాం. కాట్మాండులో షూటింగ్ జరుగుతున్నది. ఆ సందర్భంగా మేమంత ఓ రోజు డిన్నర్ ముగించాం. డిన్నర్ ముగించిన తర్వాత ఆమె వెళ్లిపోతుంటే.. ఆంటీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని నేను అడిగాను. అందుకు సమాధానం.. బెడ్ రూమ్‌కు వెళ్తున్నాను అని చెప్పింది. అయితే ఎందుకు అని అడిగితే.. పడుకోవడానికి అని చెప్పారు. అయితే ఒక్కరే పడుకొంటారా? అని అడిగాను. దాంతో అవును అని చెప్పింది. అయితే నేను నీ దగ్గర పడుకోనా? అంటూ అడిగాను.
అయితే నా ప్రశ్నకుచిన్నగా నవ్వింది. ఇంకా చాలా సమయం ఉంది. నీవు పెద్ద పెరుగు అంటూ చలాకీగా అందింది. అప్పుడు నాకు ఆ జవాబు అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు తలచుకొంటే నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఆమె చెప్పిన జవాబు ఏంటీ? అని నేను నవ్వుకొంటాను అని అభిషేక్ చెప్పాడు. అలా అభిషేక్ తెలియకుండానే చిన్న వయసులోనే కొంటె ప్రశ్నలతో ఆకట్టుకొన్నాడు.


Click it and Unblock the Notifications











