2022 లో బెస్ట్ రేటింగ్స్ అందుకున్న టాప్ తెలుగు సినిమాలు.. RRR, సీతారామం తరువాతే..
2002లో ఇండియన్ సినిమా ప్రపంచంలో సక్సెస్ అయిన వాటిలో తెలుగు సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. అలాగే కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక 2022లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB) ఆధారంగా నిలిచిన టాప్ తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..

టాప్ మూవీగా సీతారామం
ఐఎండిబి లో ఈసారి టాలీవుడ్ సినిమాలకు మంచి గుర్తింపు లభించింది. ఇక మొదటి స్థానంలో అయితే దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా నిలిచింది. తెలుగు ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అలాగే తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాకు ఐఎండిబిలో 8.6 రేటింగ్ వచ్చింది. దీంతో ఈ ఏడాది టాప్ నెంబర్ వన్ సినిమాగా ఇది నిలిచింది.

మేజర్ మూవీ
ఇక ఐఎండిబిలో ఈ ఏడాది రెండవ స్థానంలో మేజర్ సినిమా నిలిచింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్ నటించిన విషయం తెలిసిందే. ఇక శశికిరణ్ దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఐఎండిబి లో ఈ సినిమాకు 8.2 రేటింగ్ వచ్చింది దీంతో ఈ లిస్టులో సినిమా రెండవ స్థానంలో నిలిచింది.

RRR రేటింగ్
RRR సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు, రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక 2022 టాప్ తెలుగు సినిమాల్లో అత్యధిక రేటింగ్ అందుకున్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఐఎండిబి లో ఈ సినిమాకు ఎనిమిది రేటింగ్ తో మూడవ స్థానంలో నిలిచింది.

కార్తికేయ 2, అంటే.. సుందరానికి
మరో సక్సెస్ ఫుల్ సినిమా కార్తికేయ 2 కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ సినిమాకు 7.9 రేటింగ్ వచ్చింది దీంతో ఐఎండిబి టాప్ తెలుగు లిస్టులో 4వ స్థానంలో నిలిచింది. ఇక 5వ స్థానంలో 7.6 రేటింగ్ తో 'అంటే సుందరానికి' సినిమా నిలిచింది.

డీజే టిల్లు, విరటపర్వం
విశ్వక్ సేన్ నటించిన డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా 7.4 రేటింగ్ తో 6 స్థానంలో నిలవగా హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా 7.5 రేటింగ్ తో ఏడవ స్థానంలో నిలిచింది. ఇక మరొక చిన్న సినిమా సెహరి 7.1 రేటింగ్ అందుకుని తొమ్మిదవ స్థానంలో రానా దగ్గుపాటి విరాటపర్వం 7.1 రేటింగ్ తో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











