AP Elections Counting: పాలిటిక్స్‌లోను పవర్ స్టార్.. పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేసిన జాతీయ మీడియా
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి కొన్ని గంటల ముందు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. జనసేనాని వ్యూహాం వల్లే కూటమికి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ నేషన్ మీడియా ఉదరగొట్టేసింది. పవన్ కల్యాణ్ గురించి రాజ్ సర్దేశాయ్ మాట్లాడుతూ..
ఏపీలో 175 సీట్లలో 50కిపైగా పవన్ సత్తా చాటాడు. కోస్తాంధ్రలో 30 పైగా సీట్లలో పవన్ కల్యాణ్ ప్రభావం ఉంది. దాదాపు 16 శాతం ఓట్లు ఆయన వల్లే కూటమికి వచ్చాయి. చంద్రబాబు పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా అలాంటి సీట్లు రాలేదు. చంద్రబాబు ఒంటరిగా గెలువలేని పరిస్థితి నుంచి పవన్ కల్యాణ్ గట్టెక్కించాడు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ శక్తి సామర్థ్యాలు అలాంటివి అంటూ ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ తన విశ్లేషణతో ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే కూటమి ఏర్పాటులో పవన్ కల్యాణ్ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.

పిఠాపురంలోను, అలాగే గోదావరి జిల్లాలోను పవన్ ప్రభంజాన్ని అడ్డుకొనేందుకు సీఎం జగన్ రకరకాల అస్త్రాలు ఉపయోగించారు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. అలాగే పిఠాపురంలో వంగ గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారు. అయితే ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపినట్టు కనిపించలేదు అని ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇండియా టుడే టీమ్ అభిప్రాయపడింది.
అయితే కూటమి విజయం సాధించినప్పటికీ.. పవన్ కల్యాణ్‌కు పదవుల మీద ఆశలేదు. ఆయన ప్రభుత్వ పరిరక్షకుడిగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి తన మద్దతును ప్రకటించారు. అప్పటి నుంచి కూటమి, పొత్తులకు బీజం పడింది అని అన్నారు.
సినీ రంగంలో పవర్ స్టార్‌గా అందరికి తెలుసు. ఆయన పేరుకు తగినట్టుగానే అన్ని పార్టీలను ఏకం చేసి రాజకీయాల్లోను పవర్ స్టార్ అని నిరూపించుకొన్నారు. ఆయన యూత్ ఓట్లను తమవైపుకు తిప్పుకొని గణనీయమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేశారు అని ఎగ్జిట్ పోల్ సందర్భంగా జాతీయ మీడియా పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేసింది.


Click it and Unblock the Notifications











