RRR కోసం వెనుకడుగు వేసిన ఆచార్య.. భీమ్లా నాయక్ కోసం రెండు డేట్లు.. F3 న్యూ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి విడుదల తేదీల పై అందరూ ఒక నిర్ణయానికి వచ్చి సామరస్యంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా సరికొత్త విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నారు. ఆచార్య సినిమా RRR సినిమా కోసం ఒక తేదీని త్యాగం చేయగా భీమ్లా నాయక్ సినిమా మాత్రం పరిస్థితి ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చేస్తాను అని క్లారిటీ ఇచ్చేశాడు. F 3 సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

RRR రిలీజ్ డేట్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా కాలం తర్వాత మళ్ళీ విడుదల తేదీపై చాలా చర్చలు జరిగాయి. ఇక ఎలాంటి పోటీ లేకుండా సినిమాలను విడుదల చేసే విధంగా నిర్మాతలు ఒక ఒప్పందానికి వస్తున్నారు. ఇక ఫైనల్ RRR సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

భీమ్లా నాయక్...
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీపై మరోసారి అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పాండమిక్ కారణంగా సినిమాను అనుకున్నట్లుగానే విడుదల చేస్తారో లేదో చెప్పడం కష్టమే. పరిస్థితులు అనుకూలిస్తే అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. లేదంటే ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చారు.

RRR కోసం ఆచార్య త్యాగం
ఇక మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మరో బిగ్ మూవీ ఆచార్య విడుదల తేదీపై కూడా అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు మార్చి 25వ తేదీన కూడా విడుదల చేయడం లేదని చెప్పారు. ఆ డేట్ కు RRR రానుందని ఇక ఆచార్య సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు.

F3 న్యూ రిలీజ్ డేట్
వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ F3 సినిమా విడుదల తేదీపై కూడా దిల్ రాజు యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ సినిమాలో డబ్బు అనే కాన్సెప్ట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సునీల్ పాత్ర ఈ సినిమాలో సరికొత్తగా ఉండబోతోందని దర్శకుడు వివరణ ఇచ్చాడు.

మిగతా సినిమాలు ఎప్పుడంటే..
ఇక రాధేశ్యామ్ సినిమా మార్చి 11వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సంక్రాంతి రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట మే 27న వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కానీ ఇంకా ఆ విషయంలో క్లారిటీ రాలేదు. ఏప్రిల్ 14వ తేదీమ బీస్ట్, KGF చాప్టర్ 2 వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











