ఆచార్య యూనిట్ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఆచార్య. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.. దానికి తోడు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. అన్నీ సరిగా జరిగి ఉంటే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించారు.

కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ ప్రకారం ధర్మస్థలిలో చరణ్ అడుగు పెడుతున్నారని, తలుపులు తెరుచుకున్నాయని, ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాక త్వరలోనే ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఆ విషయం చెబుతూనే రామ్ చరణ్ నడుస్తూ వస్తున్నా ఒక స్టిల్ కూడా షేర్ చేశారు. ఇక హైదరాబాద్ నగర శివారులో నిర్మించిన ధర్మస్థలి అనే సెట్‌లో షూట్ జరుగుతోంది.

acharya final schedule starts and ram charan joins the shoot

దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తి కావచ్చని అంటున్నారు. చరణ్ మీద ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ షూట్ చేయబోతున్నారని అంటున్నారు. చరణ్ షూట్ పూర్తయిన తర్వాత చిరంజీవిపైనా ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, ఆ సీన్ తో సినిమా షూట్ ముగుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవి లూసిఫర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఉండగా దానికి మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X