ఆచార్య నుంచి మెలోడీ సర్‌ప్రైజ్‌.. ఈసారి రామ్ చరణ్, పూజా హెగ్డే రొమాన్స్!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఆచార్య సినిమాపై మరోసారి అంచనాలు పెరిగే విధంగా చిత్రయూనిట్ స్పెషల్ అప్డేట్ తో రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో కొంత గ్యాప్ రావడం వలన బజ్ తగ్గింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాను దసరా సమయంలోనే విడుదల చేయాలని అనుకున్నారు. లేదా డిసెంబర్ లో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అని ఆలోచించారు. కానీ కరోనా పరిస్థితులతో పాటు మిగతా సినిమాలు కూడా భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయి. కాబట్టి క్లాష్ అవ్వడం ఇష్టంలేక మెగాస్టార్ సమ్మర్ లో కి షిఫ్ట్ చేశారు.

రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో సిద్దా అనే నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి సారి తన తండ్రితో ఫుల్ లెన్త్ పాత్రలో కనిపిస్తున్న రామ్ చరణ్ తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అని మొదటి పాట తోనే అర్థం అయింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా మొదటి పాట విడుదల చేశారు. లాహే లాహే పాట ఏ స్థాయిలో వర్కవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ ఆరు పదుల వయసులో కూడా అద్భుతమైన స్టెప్పులతో అలరించాడు. తప్పకుండా బిగ్ స్క్రీన్ పై సరికొత్త అనుభూతిని ఇస్తుంది అని అలాగే బాస్ పాత రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది అని అభిమానులు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Acharya movie neelambari song release date update,

ఇక త్వరలోనే రామ్ చరణ్ తేజ్ పూజా హెగ్డే కలయికలో రూపొందిన 'నీలాంబరి' అనే మెలోడీ పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. నీలాంబరి అనే లిరికల్ పాటను ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. పాట కూడా అద్భుతంగా ఉంటుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ మళ్లీ ఆ తర్వాత సరైన విజయాన్ని అందుకోలేదు. పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా సరైన విజయం దక్కడం లేదు. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని మణిశర్మ నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X