మెగాస్టార్ సినిమా కోసం రామ్ చరణ్.. వచ్చేది ఎప్పుడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలా హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఓకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అందరి చూపు ఆచార్య పైనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆ సినిమాలో రామ్ చరణ్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్న సమయంలో అనుకోకుండా కరోనా దెబ్బ కొట్టింది. అనుమానంతో మెగాస్టార్ వెనక్కి తగ్గారు.
అయితే అంతా సర్దుకోవడంతో ఫైనల్ గా ఆయన ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక రామ్ చరణ్ జనవరిలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ తోనే ఉంటుందని టాక్ వస్తోంది. ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇంతవరకు అపజయం లేని స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్యలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఇక సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొక ఇద్దరు హీరోయిన్స్ కూడా సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా సగానికిపైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక మరోవైపు రామ్ చరణ్ RRRను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అదే జరిగితే.. రామ్ చరణ్ ఓకే ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటాడని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











