మళ్ళీ ఆచార్యతో బిజీ కానున్న మెగా టీమ్.. బ్యాలెన్స్ షూటింగ్ ఎంత ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనయుడు రామ్ చరణ్ తో మొదటిసారి ఫుల్ లెంత్ పాత్రలో నటిస్తుండడం వలన సినిమాకు ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక మరోవైపు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ఒక షెడ్యూల్. ప్లాన్ రేడి చేసుకున్నట్లు సమాచారం. షూటింగ్ లో ఒక పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉంది. అసలైతే గత నెలలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్ పనులు ఒక్కసారిగా ఆగిపోవడంతో రిలీజ్ డేట్ ను కూడా వాయిదా వేశారు.

సినిమా ఇప్పట్లో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు. ఇక రిలీజ్ విషయం గురించి తరువాత ఆలోచిద్దామని.. ముందైతే మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక కొరటాల శివ ఆచార్యను ఫినిష్ చేసిన వెంటనే ఎన్టీఆర్ సినిమాను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.
అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి వెంటవెంటనే సినిమాలను పూర్తి చేసి అనుకున్న సమయానికి బన్నీ సినిమాను కూడా సెట్స్ పైకి తేవచ్చని అనుకుంటున్నాడట. మరి కొరటాల వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











