Acharya: స్పెషల్ వీడియోతో ఆచార్య టీమ్ సర్‌ప్రైజ్.. తండ్రి కొడుకులు కుమ్మేశారుగా!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న ఆయన.. 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయనకు అదిరిపోయే కమ్‌బ్యాక్ దక్కినట్లు అయింది. ఫలితంగా ఈ సీనియర్ హీరో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఏకకాలంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు.
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రమే 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలోనే సెకెండ్ వేవ్ రావడంతో మరోసారి చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను కంప్లీట్ చేసుకున్నారు. ఇక, దాదాపుగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ వేరే సినిమాలను మొదలెట్టారు.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో.. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని తెరకెక్కించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇవన్నీ తెగ ట్రెండ్ అయిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయనే చెప్పుకోవాలి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక, తాజాగా దీనికి సంబంధించిన మరో గుడ్ న్యూస్‌ను వెల్లడించారు. ఇందులో ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 12న సాయంత్రం 5.49 గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, దీన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని మేజర్ థియేటర్లలో ముందుగా లాంచ్ చేస్తారని కూడా తెలిపారు. దీంతో మెగా అభిమానులకు ఆరోజు డబుల్ ట్రీట్ ఉండబోతుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











