twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya Theaters Count: అన్ని వేల థియేటర్లలో ఆచార్య.. పవన్ రికార్డు బ్రేక్

    |

    సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, అన్నింటికీ మించి గ్రేస్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంటరైన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాగే, స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి అస్సలు వెనక్కి తిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇక, కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది సక్సెస్ అవడంతో వరుస పెట్టి సినిమాలను చేస్తూ వెళ్తున్నారు.

    బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!బెడ్‌పై బట్టలు లేకుండా పాయల్ రాజ్‌పుత్: వామ్మో ఆమెనిలా చూశారంటే షాకే!

    రీఎంట్రీ తర్వాత యమ జోష్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలైట్లు చేసే ఉద్యమం నేపథ్యంతో.. భావోద్వేగ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ల కారణంగా షూటింగ్ ఎన్నో సార్లు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో టాకీ పార్టు కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసి రిలీజ్‌కు రెడీగా ఉంచారు.

    Acharya Movie Worldwide Total Theaters Count

    మెగా హీరోల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి పాటలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా ఒక్కసారిగా రెట్టింపు అవడంతో పాటు థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. దీంతో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' మూవీకి సంబంధించిన థియేటర్ల కౌంట్‌ బయటకు వచ్చింది.

    బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!బ్రాతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: తల్లైనా తగ్గకుండా బెడ్‌పై యమ హాట్‌గా!

    తాజా సమాచారం ప్రకారం 'ఆచార్య' మూవీని నైజాంలో 355, సీడెడ్‌లో 260, ఆంధ్రాలో 520 వరకూ అంటే మొత్తంగా 1150 నుంచి 1200 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 200, ఓవర్సీస్‌లో 650 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లకు పైగానే రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక, అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రాల జాబితాలో ఇది 14వ స్థానంలో ఉంది. తద్వారా పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమా రికార్డును ఇది అధిగమించింది.

    చిరంజీవి, చరణ్ కాంబోలో రూపొందిన 'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

    English summary
    Chiranjeevi, Ram Charan Did Acharya movie Under Koratala Siva Direction. Lets Know about This Movie Total Theaters Count.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X