‘ఆచార్య’తో కలిసి అలా కనిపించిన ‘సిద్ధ’: ఆకట్టుకుంటోన్న రామ్ చరణ్ నక్సలైట్ లుక్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే మెగా మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. అదే.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆచార్య'. ఈ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆది నుంచి భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నుంచి ఓ సర్‌ప్రైజ్ వచ్చేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న మెగా మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య'లో రామ్ చరణ్ పాత్ర కీలకంగా ఉండబోతుంది. అతడు ఇందులో 'సిద్ధ' అనే నక్సలైట్ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలోని రామ్ చరణ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి.. చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ తుపాకులు పట్టుకుని వస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దీనికి 'ఆచార్య'తో సిద్ధ అనే క్యాప్షన్ జోడించారు. ఆయన చేసిన పోస్టును రీట్వీట్ చేసిన రామ్ చరణ్.. 'మీ పక్కన నటించాలన్న కల ఇప్పటికి నెరవేరింది నాన్న' అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టర్‌లో తండ్రీ కొడుకులు జంటగా దర్శనమివ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.



Click it and Unblock the Notifications











