Siddhas Saga: ఆచార్య నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ఆరోజున మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అందుకే సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ బడా హీరో.. మరిన్ని ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇక, ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న చిత్రాల్లో 'ఆచార్య' ఒకటి. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా అప్‌డేట్? పూర్తి వివరాలు మీకోసం!

 మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇది కూడా అలాగే రాబోతుంది

ఇది కూడా అలాగే రాబోతుంది

కొరటాల శివ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య అయిన చిరంజీవి దాన్ని కంప్లీట్ చేస్తాడట.

 భారీ స్థాయిలో మూవీ బిజినెస్

భారీ స్థాయిలో మూవీ బిజినెస్

మెగాస్టార్ చిరంజీవి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హిందీలోనూ రాబోతుంది.

రిలీజ్ డేట్‌తో ఫ్యాన్స్ నిరాశగా

రిలీజ్ డేట్‌తో ఫ్యాన్స్ నిరాశగా

'ఆచార్య' మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో ఈ చిత్రాన్ని దసరాకో, దీపావళికో విడుదల చేస్తారని అనుకున్నారు. ఒకానొక దశలో సంక్రాంతికి కూడా విడుదల చేసే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనిపై ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

 ఆచార్య నుంచి బిగ్ సర్‌ప్రైజ్

ఆచార్య నుంచి బిగ్ సర్‌ప్రైజ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ నుంచి అప్పుడప్పుడూ ఏదో ఒక కానుకను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 10:08 గంటలకు ఒక అప్‌డేట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, దాన్ని సాయంత్రానికి వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు సమయం ఆసన్నమవడంతో టీజర్ గురించి ప్రకటించారు.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
ఆరోజున పూనకాలు ఖాయమే

ఆరోజున పూనకాలు ఖాయమే

'ఆచార్య' మూవీలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన టీజర్‌ను వదలబోతున్నట్లే ప్రకటించారు. దీన్ని నవంబర్ 28 రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి 'Siddhas Saga' అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ దీని కోసం వేచి చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X