HappyBirthday Sonu : ఆచార్య టీం స్పెషల్ విషెస్‌.. అంతకన్నా ఏం కావాలంటూ చిరు ట్వీట్!

రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారిన సోను సూద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి సోనూసూద్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

రియల్ హీరో

రియల్ హీరో

కరోనా సమయంలో రియల్ హీరో గా అవతరించిన సోనూసూద్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య టీం కూడా సోనూసూద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్య సినిమాలో ఆయన లుక్ ని రిలీజ్ చేసింది.. అయితే గతంలో లాగా కాకుండా ఈ లుక్ లో సోనుసూద్ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. నుదుటన బొట్టుతో పిలకతో మెడలో పూసల దండ వేసుకున్న సోనూసూద్ లుక్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆచార్యలో బిజీ

ఆచార్యలో బిజీ


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని కొరటాల శివ చాలా కాలం నుంచి రూపొందిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోయినా దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతోంది.

అంతకన్నా ఏముంది

అంతకన్నా ఏముంది

ఇక సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డియర్ సోనూసూద్ ను ఒక నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కంటే పెద్ద శాటిస్ఫ్యాక్షన్ ఏదీ లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. నువ్వు జీవితంలో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని నీ జీవితం ఎప్పుడు ఇంతే అందంగా అర్ధవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Recommended Video

Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
కొట్టాలంటే బాధ

కొట్టాలంటే బాధ

నిజానికి ఈ సినిమాలో చిరంజీవి సోనూసూద్ మధ్య ఒక ఫైట్ వుంటుంది. ఈ ఫైట్ లో భాగంగా చిరంజీవి సోనూసూద్ కొట్టాల్సి వస్తుంది. అయితే సోనూసూద్ చేస్తున్న సేవను చూసి తాను సోనూసూద్ మీద చేయి చేసుకోవాలంటే ఏదోలా ఉంది అని ఒకవేళ తాను ఇప్పుడు కొట్టినా ప్రజలు తనను రిసీవ్ చేసుకోలేరు అని తనను తప్పుగా అనుకుంటారు అని కూడా చిరంజీవి ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టంగా ఉందని కొట్టను అని చెప్పినా దర్శకుడు కొరటాల శివ కథ ప్రకారం కొట్టాల్సి వస్తుంది కాబట్టి దగ్గరుండి కొట్టించారు.

ఇక హీరోనే

ఇక హీరోనే

ఇక ఈ సంఘటనతో సోనూసూద్ మనసు మారిపోవడంతో ఇకమీదట తను విలన్ వేషాలు వేయకూడదని చేస్తే హీరో వేషాలు వేయాలి కానీ విలన్ వేషాలు వేస్తే ప్రజలు తనను చూసి తట్టుకోలేరు అని ఫిక్స్ అయ్యారు. అందుకే అప్పటి నుంచి ఆయన విలన్ పాత్రలు ఒప్పుకోవడం తగ్గించాడు. ఆయన హీరోగా లాంచ్ కావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి బహుశా మరో ఏడాది లోపు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X