‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్: డెడ్‌లైన్ పెట్టిన చిరంజీవి.. గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ
మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కొంత కాలంగా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా దీనిని ప్రారంభించి.. పూర్తి చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీ షూటింగ్‌ను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివకు చిరంజీవి డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మించిన టెంపుల్ టౌన్ సెట్‌లో రామ్ చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించబోతున్నాట. ఇది ఇవాళే ప్రారంభం కావాల్సి ఉన్నా.. సోమవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. చివరి షెడ్యూల్‌గా పేర్కొంటోన్న దీనిలో ఈ పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నటీనటులు సిద్ధం అయ్యారని టాక్.

ఏప్రిల్ చివరి కల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తే.. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని కొరటాల శివ భావిస్తున్నట్లు తెలిసింది. బయట ప్రచారం జరుగుతున్నట్లు కాకుండా అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేయాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిరు సరసన కాజల్.. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











