‘ఆచార్య’ షూటింగ్ అప్‌డేట్: రామ్ చరణ్‌పై మరొకటి.. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది

'సైరా: నరసింహారెడ్డి' వంటి భారీ ప్రాజెక్టు తర్వాత టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి - టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఇందులో మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. కొంత బ్యాలెన్స్ ఉన్న పార్టును కూడా కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్ గురించి కీలక అంశం ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' సినిమా షెడ్యూల్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతుందట. ఇందులో భాగంగానే హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ వ్యయంతో వేసిన ధర్మస్థలి సెట్‌లో రామ్ చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇది అతడి సోలో సాంగ్ అని అంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ పూజా హెగ్డేతో కలిపి ఓ డ్యూయట్‌ను షూట్ చేశారు. ఇప్పుడీ పాట కూడా పూర్తయితే రామ్ చరణ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లు లెక్క. అందుకే త్వరగా అతడిని సినిమా నుంచి రిలీవ్ చేయాలని దీనిని ప్లాన్ చేశారట. పూజా హెగ్డే పార్ట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలిసింది.

Acharya Update: Ram Charan Song Starts From April 9th

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆచార్య'లో చిరంజీవి, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇక, ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X