ఆడపిల్లకి ముద్దు పెడతానంటావా .. ఏం సినిమాలు తీస్తున్నావ్, అల్లు అర్జున్‌‌పై ఏసీపీ సంచలనం

పోలీస్ శాఖపై టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై విమర్శలు గుప్పించారు. రోడ్డుపై కుక్కపిల్ల చనిపోతేనే ఒక్క నిమిషం ఆగి ఎలా జరిగిందో తెలుసుకుంటామని అన్నారు. అలాంటిది నీ కళ్ల ముందు ఇద్దరు వ్యక్తులు శవాల్లాగా పడిపోయి ఉంటే పట్టించుకోకుండా ఎలా వెళ్లారని ఏసీపీ ప్రశ్నించారు. ఆయన కళ్లలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని.. సక్సెస్‌మీట్‌లకు వెళ్లలేకపోతున్నానే బాధే హీరో గారిలో కనిపిస్తోందని మండిపడ్డారు. వాళ్ల ఇంటిని ఓ కళ్యాణ మంటపంలా మార్చేసి చాలా హ్యాపీగా గడుపుతున్నారని ఏసీపీ తెలిపారు.

డబ్బులు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావని నువ్వు బాధితుడివి ఎలా అవుతావని విష్ణుమూర్తి ప్రశ్నించారు. రాత్రి కాబట్టే పరిస్ధితి అలా ఉంటే అదే పగటిపూట ఇలాంటిది జరిగితే శాంతి భద్రతలు అదుపు తప్పేవన్నారు. అంత ఇరుకైన స్థలంలో అంత మందితో ఇలాంటి కార్యక్రమాలు వద్దని మేం ముందే హెచ్చరించామని ఏసీపీ చెప్పారు. నీ సినిమాలలో పోలీస్ ఆఫీసర్లని అసభ్యంగా చూపిస్తున్నావని.. సెన్సార్ బోర్డ్ ఏ రకంగా ఇలాంటి సినిమాలకు అనుమతులు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ACP Sabbathi Vishnumurthy made sensational comments on allu arjun and pushpa 2

జూబ్లీహిల్స్ ఏరియాలో రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి.. నువ్వు ఇండస్ట్రీని డెవలప్ చేస్తానంటే మా త్యాగాల మీద మేం ఇచ్చిన సొమ్ము అని ఏసీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పరిధిలో మీరుంటే ఎవరు క్వశ్చన్ చేయరని.. ఎవరో ఒకరికి కడుపు మండితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. నేను డబ్బులు ఇస్తున్నానంటే ఎవరికి కావాలి నీ ముష్టి ...పోయిన ప్రాణాన్ని కోట్లు ఇచ్చినా వెనక్కి తీసుకురాగలుగుతావా అని ఏసీపీ ప్రశ్నించారు.

దేశానికి పనికొచ్చే సినిమాలు తీస్తున్నారా.. దొంగతనం ఎలా చేయాలి, ఎలా పారిపోవాలి ఇలాంటివే కదా అంటూ ఆయన చెలరేగిపోయారు. 1000 రూపాయిలిస్తే అది ముద్దు పెడుతుందేమో అడుగు అంటూ మహిళల్ని కించపరుస్తావా అంటూ ఏసీపీ విష్ణుమూర్తి ప్రశ్నించారు. ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ బట్టలు విప్పించి చూపిస్తావా అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

తమ సినిమా తప్పించి మరో సినిమా థియేటర్‌లలో ఉండకూదడన్నట్లుగా ప్లానింగ్ ప్రకారం వ్యవహరిస్తున్నారని ఏసీపీ మండిపడ్డారు. మీ తోలు మంచిగా ఉంచుకోకుంటే తోలు పగలగొడతామని ఏసీపీ హెచ్చరించారు. నీకు హావభావాలు పలికించడం రాదు, నటించడం రాదు నువ్వు ఎలా నటుడివి అయ్యావంటూ విష్ణుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దురద వస్తే గడ్డం కింద చేతులు మేం కూడా పెట్టుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

మాట్లాడితే పోలీసులు నాకేం చెప్పలేదు అంటున్నావ్.. నువ్వేమైనా తీస్‌మార్ ఖాన్‌వా నీకసలు ఎందుకు చెప్పాలి అని ఏసీపీ ప్రశ్నించారు. నీ ఆధార్ ఆంధ్రాలో ఉందో, తెలంగాణలో ఉందో ముందు అది డిక్లేర్ చేయాలంటే విష్ణుమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఉండేది లీజు ఇంట్లో అని.. లీజు గడువు పూర్తయితే నీ పరిస్ధితి ఏంటి, పోలీసుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని ఏసీపీ విష్ణుమూర్తి హెచ్చరించారు.

More from Filmibeat

Read more about: allu arjun revanth reddy pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X