Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ ఆంటోని పోటాపోటిగా కిల్లర్.. జూన్ మొదటివారంలో
క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కొలైగారన్. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్ కిల్లర్ పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా కథానాయిక. దియా మూవీస్ ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
మర్డర్ మిస్టరీ.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. విజయ్ ఆంటోని.. యాక్షన్ కింగ్ అర్జున్ పోటాపోటీగా నటించే చిత్రం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైమన్ కే సింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్ల నేపథ్యంలో తెలుగు వెర్షన్ నిర్మాతలు టీ నరేష్ కుమార్, టి శ్రీధర్ మాట్లాడుత.. క్రైమ్ జోనర్లో విభిన్నమైన కాన్సెప్ట్ ఇది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్‌తో రక్తి కట్టిస్తుంది. అర్జున్ నటన సినిమాకే హైలైట్. విజయ్ ఆంటోని పాత్ర ఇప్పడే వెల్లడించం. సినిమాకు ఇదే సస్పెన్స్. అన్ని వర్గాల్ని మెప్పించే అంశాలతో రూపొందిన చిత్రమిది.
ఇటీవలే దుబాయ్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలతో చిత్రీకరించారు. తాజాగా విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది . మే రెండవ వారంలో ట్రైలర్ విడుదల చేస్తున్నాం. రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో సినిమా విడుదల చేయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.
అర్జున్, విజయ్ ఆంథోని, అషిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి: మాటలు, పాటలు: భాష్యశ్రీ, సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, పి.ఆర్వో: సాయి సతీష్, ఆర్ట్: వినోద్ రాజ్ కుమార్, నిర్మాతలు: టి.నరేష్ కుమార్- టి.శ్రీధర్, రచన- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.