NTR30: ఎన్టీఆర్ మూవీకి హాలీవుడ్ టచ్.. ఒక్క ఫొటోతో సినిమా రేంజ్ పెంచేశారుగా!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ బడా హీరో ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. దీనికితోడు ఆస్కార్ వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్ లిస్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఎన్టీఆర్.. గతంలో తనకు 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన కొరటాల శివతో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గత వారంలోనే ముగిశాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చాలా ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. అది అయిన వెంటనే కొరటాల శివ ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన పనులను షురూ చేసేశారు. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో తన టీమ్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ తెరకెక్కించబోతున్న సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, దీన్ని కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కించబోతున్నారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్‌లో సముద్రంపై వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఓ షిప్‌పై ఆయనతో పాటు కొరటాల శివ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. కెన్నీ Mission Impossible, The Italian Job, Transformers వంటి చిత్రాలకు పని చేశారు.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











