Pawan Kalyan's OG: లీకైన ఓజీ యాక్షన్ సీన్ .. పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీకి పూనకాలే!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లును రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ఈ రెండింటిలో ఓజీపై అందరి చూపు నెలకొంది. తాజాగా ఓజీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ బడ్జెట్ ఎంత?
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

ఓజీ షూటింగ్‌కి ఆటంకాలు
ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 2022న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో వేగంగా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఓజీకి ఆటంకం ఎదురైంది. అయితే పాలనాపరంగా కుదురుకున్న తర్వాత తను కమిటైన సినిమాలను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగా ఓజీ సెట్‌లో అడుగుపెట్టి.. వడివడిగా షూటింగ్ కంప్లీట్ చేశారు.
సెప్టెంబర్ 25న ఓజీ
హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఓజీపై పడ్డాయి. సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. రిలీజ్ మరో రెండు నెలల్లోకి రావడంతో ఓజీ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కానుంది. ఆగస్ట్ 3 లేదా 5 తేదీల్లో ఈ పాట రిలీజ్ అవుతుందని మేకర్స్ నుంచి సంకేతాలు అందాయి. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందోనని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు.
ఆ యాక్షన్ సీన్ లీక్
ఇదిలాఉండగా .. పవన్ కళ్యాణ్ సినిమా, అందులోనూ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఓజీలో ఫైట్స్ అదరిపోతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓజీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. షర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఓ భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొన్నారని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈసారి మాత్రం ఏకంగా ఓజీ నుంచి యాక్షన్ సీన్ లీకైంది. ఈ సినిమాకు కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫి అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సీన్ రిహార్సల్ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ సీన్ ఓజీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అని చెబుతున్నారు. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. నువ్వు మనిషావా మృగానివా? ఫైట్ కంపోజిషన్‌కి దండాలు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం. అని ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











