రెండోది కూడా లీక్: పవన్ నుంచి ఇది ఊహించి ఉండరు.. పవర్ స్టార్ దెబ్బకు వాళ్లంతా ఔట్.!
ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో సత్తా చాటుతూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఆయన.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లాడు. అక్కడ అనుకూల ఫలితాలు రాకపోయినా ఏమాత్రం వెనుకడుగు వేయలేదాయన. అదే సమయంలో ఆదాయ వనరుల కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పేరు మారుమ్రోగిపోతోంది. తాజాగా ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఈ వివరాలేంటో చూద్దాం.!

పవన్ కల్యాణ్ ఇలా మొదలు పెట్టాడు
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' అనే సినిమా తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్' ద్వారా పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా ఆయన ఇందులో కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు చేస్తున్నారు.

పవర్ స్టార్ క్రేజ్‌కు నిదర్శనం ఈ రికార్డులే
పవన్ కల్యాణ్ రీఎంట్రీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఆయన ఖాతాలో వచ్చి చేరుతున్న రికార్డులే. ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్' ఫస్ట్ లుక్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో 3.5 కోట్ల ట్వీట్లు వచ్చాయి. అలాగే, తాజాగా విడుదలైన ‘ముగవ మగువ' పాట కూడా దూసుకుపోతోంది.

ఈ ఒక్కటే కాదు.. వాళ్లతో కూడా సెట్
రీఎంట్రీలో పవన్ కల్యాణ్ మాంచి దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్' సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి ఆయన సంతకం చేసేశాడు. ఈ రెండు చిత్రాలను ఏఎమ్ రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ మరిన్ని సినిమాలను చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి తర్వాత పవన్.. ఇదే ప్రత్యేకం
ప్రస్తుతం పవన్ చేయబోతున్న మూడు సినిమాల్లో క్రిష్ తెరకెక్కించే ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనది అన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ మూవీ పిరియాడిక్ జోనర్‌లో రాబోతుండడమే. ఇందులో పవన్ బ్రిటీష్ వారి సంపదను దోచుకునే స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నాడట. చిరంజీవి ‘సైరా' తర్వాత పవర్ స్టార్ అలాంటి పాత్రనే పోషించబోతున్నాడు.

పవన్ నుంచి ఇది ఊహించి ఉండరు
‘వకీల్ సాబ్'కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు బటయకు వచ్చిన విషయం మరువక ముందే తాజాగా క్రిష్ సినిమా నుంచి ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... ఇప్పటికే ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను పవన్ పూర్తి చేశాడట. అత్యంత రహస్యంగా జరిగిన ఈ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని ప్రచారం జరుగుతోంది.
Recommended Video


పవర్ స్టార్ దెబ్బకు వాళ్లంతా ఔట్.!
హైదరాబాద్ శివారలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సన్నివేశాలు చిత్రీకరించారట. కోహినూర్ డైమండ్ గురించి సాగే ఈ పోరాటంలో పవన్.. బ్రిటీష్ సైన్యం అంతటికీ చిత్తు చేశాడని అంటున్నారు. ఈ ఫైట్ పవన్ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కించాడట క్రిష్. సినిమాలో హైలైట్‌గా నిలిచే ఈ సీక్వెన్స్ దాదాపు 15 నిమిషాలు ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











