అఖండ నుంచి లీకైన అదిరిపోయే న్యూస్: ఆ టైంలో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమట

'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ ఆయన ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా కొంత కాలంగా మూవీల మీద మూవీలు చేస్తూ వచ్చారు. కానీ, సరైన సక్సెస్‌ను మాత్రం అందుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఆయన 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. తాజాగా దీని నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ' మారిన బాలకృష్ణ

‘అఖండ' మారిన బాలకృష్ణ

ఈ మధ్య హిట్ లేక సతమతం అవుతోన్న నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ బడా దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు.

ఏ హీరో చేయని విధంగా అలా

ఏ హీరో చేయని విధంగా అలా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీ కోసం బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న స్టార్‌గా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇది ఆయన కెరీర్‌లోనే స్పెషల్ మూవీ కాబోతుంది.

సొంతమైన సౌతిండియా రికార్డ్

సొంతమైన సౌతిండియా రికార్డ్

'అఖండ' మూవీ నుంచి ఆ మధ్య టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. తద్వారా సీనియర్ హీరోల చిత్రాల్లో దక్షిణ భారతదేశంలోనే టాప్‌కు చేరుకుంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా భారీ స్పందనను అందుకుంది.

బాలయ్య కెరీర్‌లోనే భారీ రేంజ్

బాలయ్య కెరీర్‌లోనే భారీ రేంజ్

ఆరంభంలో 'అఖండ' మూవీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక డీల్స్ కుదిరాయి.

 సెన్సార్ జరుపుకున్న అఖండ

సెన్సార్ జరుపుకున్న అఖండ

విడుదలకు సమయం దగ్గర పడడంతో 'అఖండ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్రం సెన్సార్ బోర్డుకు వెళ్లింది. అక్కడ ఈ సినిమాను చూసిన మెంబర్లు దీనికి U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారట. అంటే అన్ని వర్గాల వాళ్లకూ చేరువయ్యే సినిమా అయింది. ఇక, ఈ సినిమా రన్ టైమ్ 2:47 గంటలు అని తెలుస్తోంది.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

హిట్ కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఇక, ఇందులో బోయపాటి మార్క్ ఫైట్స్, డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొత్తం 2:47 గంటల రన్‌ టైంతో ఉండగా.. అందులో 45 నిమిషాల పాటు ఫైట్సే ఉంటాయట. వీటితో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X