Aadhi Pinisetty: హీరోయిన్ తో వైభవంగా ఆది పెళ్లి వేడుక.. ఫంక్షన్ లో టాలీవుడ్ హీరోల సందడి

సౌత్ ఇండస్ట్రీ లో మంచి నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న ఆది పినిశెట్టి మొత్తానికి ఓ ఇంటివాడు అయ్యాడు. గత కొంత కాలంగా ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్న ఈ టాలెంటెడ్ నటుడు మొత్తానికి అనుకున్నట్లే ఆమెను వివాహం చేసుకున్నాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక వీరి పెళ్లి వేడుకకు ఎవరెవరు వచ్చారు అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

Master దూసుకుపోతున్నాడు.. Thalapathy Vijay మూవీ కి గ్రాండ్ ఓపెనింగ్ ! || Filmibeat Telugu
ఆ సినిమాలతో..

ఆ సినిమాలతో..

తెలుగు తమిళం ఇండస్ట్రీలో సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్న ఆది పినిశెట్టి కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా ఎన్నో నెగిటివ్ రోల్స్ కూడా చేశాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు సపోర్టింగ్ రోల్స్ తో కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. గుండెల్లో గోదావరి సినిమాతో మొదటి ఈ హీరో తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు ఆ తర్వాత రంగస్థలం లో హీరో సోదరుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

వైభవంగా పెళ్లి వేడుక

వైభవంగా పెళ్లి వేడుక

అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించిన ఆది పినిశెట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇలా తనలోని విభిన్నమైన నటనను ఎప్పటికప్పుడు బయట పెడుతూ వస్తున్నాడు. అయితే మొత్తానికి ఆది పినిశెట్టి అనుకున్నట్లుగానే తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల నడుమ చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు కొంతమంది సినీ తారలు పాల్గొన్నారు.

అంతకుముందు రూమర్స్ అని..

అంతకుముందు రూమర్స్ అని..

ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఎప్పుడూ కూడా ఇద్దరు వారి ప్రేమ గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఎంగేజ్మెంట్ జరిగే వరకు కూడా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లు ఎవరికీ పెద్దగా తెలియదు. అంతకుముందు వరకు వచ్చిన వార్తలను కూడా రూమర్స్ అని అనుకున్నారు. కానీ ఈ జంట స్నేహాంగా ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఈవెంట్స్ లో స్వేచ్ఛగా పాల్గొంటూ వచ్చారు.

అలా ప్రేమలో..

అలా ప్రేమలో..

2015 లో వచ్చిన 'యాగవరణైమ్ నా కక్కా' అనే సినిమా ద్వారా మొదటిసారి కలుసుకున్న ఈ జంట అలా కొన్ని నెలలలోనే మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాలతో పరిచయం ప్రేమగా మారింది. ఇక దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన నిన్నటితో దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయంగా వీరి పెళ్లి వేడుక జరిగింది.

సందడి చేసిన హీరోలు

సందడి చేసిన హీరోలు

ఇక వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంత మంది సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. ఆది పినిశెట్టి కి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి నేచురల్ స్టార్ నాని తో పాటు సందీప్ కిషన్ కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా హల్దీ వేడుకలో కూడా ఆ హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక త్వరలోనే ఆది టాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేసే విధంగా ఒక రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X