పవన్ కళ్యాణ్ లేకపోతే నన్ను ఉతికారేసేవారు.. ‘గబ్బర్ సింగ్’తో నా లైఫ్ ఇలా!
విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభిమన్యు సింగ్. బిహార్ కు చెందిన అభిమన్యు సింగ్ 2001లో వచ్చిన హిందీ ఫిల్మ్ 'అక్స్'తో కెరీర్ ను ప్రారంభించాడు. ఆయన తొలివేషం ఇన్పెక్టర్ గా కనిపించారు. అప్పటి నుంచి తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంతకంతకు ఎదుగుతూ వస్తున్నారు. ముఖ్యంగా 2010లో వచ్చిన 'గులాల్', 'రక్త చరిత్ర' వంటి చిత్రాలు ఆయనకు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఇక తెలుగులో అభిమన్యు తొలుత 'నేను నా రాక్షసి' చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. సిద్దప్ప నాయుడిగా నెగెటివ్ రోల్ లో ఇరగదీశాడు. పవన్ కళ్యాణ్ కు ధీటుగా పెర్ఫామ్ చేసి ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. అప్పటి నుంచి ఆయనకు తెలుగులో మంచి ఆఫర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత 'ముకుంద', 'పండగ చేసుకో', 'జై లవ కుశ', 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి చిత్రల్లో నటించి మెప్పించారు. చివరిగా కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్'తో అలరించారు.

అయితే... పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' తో తన జీవితం మారిపోయిందని, పవర్ స్టార్ కు విలన్ గా నటించిన తర్వాత నుంచి రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయిందని చెప్పారు. అంతకు ముందు మరీ తక్కువ పారితోషికానికి పనిచేయాల్సి వచ్చేదని చెప్పారు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు అభిమన్యు సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇలా మాట్లాడారు. తను ఫస్ట్ టైమ్ ఇన్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్'తోనే అత్యధికంగా పారితోషికం అందుకున్నట్టు తెలిపారు.
అభిమన్యు సింగ్ 'గబ్బర్ సింగ్'కు ముందు ఒక్క సినిమాకు రూ.40 వేలు మాత్రమే తీసుకునే వాడినని చెప్పుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో నటించిన తర్వాత ఆయన రెమ్యునరేషన్ పెరిగిందన్నారు. గబ్బర్ సింగ్ కు కూడా రూ.40 లక్షలు అందుకున్నానని తెలిపారు. తన కెరీర్ లో అంత పెద్ద అమౌంట్ అందుకోవడం అదే మొదటి సారి అని చెప్పారు. రూ.40 వేల నుంచి రూ.40 లక్షలకు ఒకేసారి రెమ్యునరేషన్ జంప్ అవడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.
అయితే.. 'గబ్బర్ సింగ్' షూటింగ్ సమయం నుంచే పవన్ కళ్యాణ్ బాగా బిజీగా ఉండేవారని.. ఆయన సెట్స్ కు వచ్చే వరకూ దర్శకుడు హరీశ్ శంకర్ అభిమన్యు సింగ్ తోనే షూటింగ్ చేసేవాడంట. అలా ఏకంగా పదిరోజులు వరుసగా పవన్ సార్ వచ్చే వరకు.. ఖాళీ గా ఉన్న తనతో షూటింగ్ తప్పకుండా చేయించేవారని చెప్పారు. ఆ సినిమాకు పనిచేయడం మంచి ఫలితానిచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం అభిమన్యు మరోసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. అది కూడా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న 'ఓజీ' కావడం విశేషం.


Click it and Unblock the Notifications











