Akira Nandan: పవన్ కళ్యాణ్ వారసుడితో మల్టీస్టారర్.. అడివి శేష్ ఏమన్నాడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ వెండితెరకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఓ వర్గం ఆడియన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకూ మెగా కుటుంబ సభ్యుల నుంచి అకిరా ఎంట్రీ పై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ముఖ్యంగా తల్లి రేణుదేశాయ్ సైతం అకిరాకు అలాంటి ఆలోచన లేదని కూడా తెలియజేశారు. ఇక అకిరా నందన్ కు ఎంతో మంచి స్నేహితుడు అయినటువంటి అడవి శేష్ ఇటీవల అతనితో ఉన్న అనుబంధం గురించి వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా మీ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా ఏమైనా ఉంటుందా అనే అంశంపై కూడా సమాధానం ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మ్యూజిక్ పై పట్టు

మ్యూజిక్ పై పట్టు

పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ ఇప్పటికే హైట్ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నిలిచాడు. అంతే కాకుండా అతను ప్రత్యేకంగా బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఇక మ్యూజిక్ అంటే ఇష్టమని ఇటీవల క్లారిటీ వచ్చేసింది. తన స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ లో ప్రత్యేకంగా దోస్తీ పాట మ్యూజిక్ తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు.

పవన్ వారసుడిగా..

పవన్ వారసుడిగా..

అకిరాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో లీకైన కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అతను ఇండస్ట్రీలోకి అడుగు పెడితే మాత్రం తప్పకుండా పవర్ స్టార్ వారసత్వాన్ని కోమసాగిస్తాడు అని ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ పెంచుకుంటాడు అని అభిమానుల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అకిరా నందన్ పేరు మీద అనేక రకాల ఫ్యాన్ పేజీలు కూడా క్రియేట్ అయ్యాయి.

అకిరాతో మంచి స్నేహం

అకిరాతో మంచి స్నేహం

సోషల్ మీడియాలో అకీరానందన్ పేరు ఒక్కసారి అలా కనిపిస్తే చాలు ట్రెండింగ్ లిస్టులో చేరిపోతుంది. అకిరా నందన్ ఇండస్ట్రీలో మిగతా హీరోల పిల్లలతో అయితే ఎక్కువ గా కనిపించడు. కానీ తనకంటే వయసులో ఎంతో పెద్దవాడు అయినా అడవి శేష్ తో మాత్రం చాలా స్నేహంగా ఉంటాడు అని చాలాసార్లు అర్థమైంది. పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో అడివి శేష్ ఒక నెగిటివ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ షూటింగ్లో అఖిరా నందన్ తో ఒకసారి పరిచయం పెంచుకున్న శేష్ ఆ తర్వాత అదే స్నేహాన్ని కంటిన్యూ చేశాడు.

 శేష్ కామెంట్

శేష్ కామెంట్

ఇక ప్రస్తుతం మేజర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అడివి శేష్ అకిరానందన్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నాడు. అలాగే అతనితో ఉన్న అనుబంధం గురించి కూడా తెలియజేశాడు. తమ ఇద్దరి మధ్యలో కూడా మంచి స్నేహం ఉంది అని అకిరా నందన్ ఒక బ్రదర్ గా చాలా విషయాలు తనతో షేర్ చేసుకుంటాడు అని తెలియజేశాడు.

మల్టీస్టారర్?

మల్టీస్టారర్?

ఇక అకిరా నందన్ తో మల్టీస్టారర్ సినిమా ఏమైనా చేస్తారా అనే ప్రశ్న కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న శేష్ ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఏమీ లేదు అని ఆయన అకిరా నందన్ సినిమాలలో నటించాలి అనే ఆసక్తి కూడా ఎప్పుడు చూపించలేదు అని అన్నాడు. కేవలం అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు అని వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X