చాక్లెట్ బాయ్‌కి కరోనా పాజిటివ్.. స్వీయ గృహ నిర్బంధంలో చికిత్స
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ అఫ్తాబ్ శివదాని కరోనావైరస్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ 19 సోకిందని స్వయంగా అఫ్తాబ్ తన ట్విట్టర్ పేజ్ ద్వారా వెల్లడించారు. కరోనై వైరస్ లక్షణాలు కనిపించగానే వైద్య పరీక్షలు జరిపించాను. పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో చేసిన పోస్టులో..
మీరందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నానని భావిస్తున్నాను. ఇటీవల నాకు స్వల్పంగా పొడి దగ్గు, జ్వరంతో బాధపడ్డాను. ఎందుకైనా మంచిదని వైద్య పరీక్షలు చేయించుకొన్నాన. ఆ పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. వైద్యులు, అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నాను. కొద్ది రోజులుగా నాతో దగ్గరగా ఉన్నవాళ్లు దయచేసి ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకోండి. మీ అందరి దయ, ప్రార్థనలతో త్వరలోనే కోలుకొని మాములు మనిషిని అవుతాను. మీరంత సామాజిక దూరాన్ని పాటించండి. మన ప్రాణాలను రక్షించుకోవడానికి శానిటైజర్స్ వాడుతూ.. మాస్కులు ధరిద్దాం. ఈ మహమ్మారిపై పోరులో విజయం సాధిద్దాం అని అఫ్తాబ్ శివదాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక అఫ్తాబ్ శివదాని కెరీర్ విషయానికి వస్తే.. మిస్టర్ ఇండియా సినిమాలో బాలనటుడిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత షెహన్‌షా, చాల్‌బాజ్ లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మస్త్ చిత్రం ద్వారా హీరోగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











